సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఓ ప్రయాణికుడు పవర్ బ్యాంక్ నుంచి మంటలు వచ్చాయి. మంటలు గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటూన మంటలను ఆర్పేసారు. అనంతరం ఎమర్జెన్సీగా విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు.
కాగా ప్రమాద సమయంలో విమానంలో 85 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై ఎయిపోర్టు అథారిటీ దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: పవర్‌ప్లాంట్‌లో విష వాయువులు లీక్


