రాంచీ: జార్ఖండ్‌లోని వేదాంత గ్రూప్‌కు సంబంధించిన బొకారో ఇఎస్ఎల్ (ESL) స్టీల్ ప్లాంట్‌లో ఈ రోజు (ఆదివారం) ప్రమాదం జరిగింది. విషవాయువులు లీకై ఒక ఎగ్జిక్యూటివ్, మరో ఇంజనీర్ మృతిచెందారు. ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నెస్-1 వద్ద వీరు పనిచేస్తుండగా అకస్మాత్తుగా విషవాయువు (కార్బన్ మోనాక్సైడ్ కావచ్చునని ) భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆ ఇద్దరినీ అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కంపెనీ సిబ్బంది తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై సమగ్రమైన స్వతంత్ర దర్యాప్తు జరిపిస్తామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం ప్రకటించింది.
ఇదీ చదవండి: ఇదేంది మామ కొంచెం ఉంటేనా


