కోనసీమలో కలకలం.. భారీ శబ్దాలతో గ్యాస్‌ లీక్‌ | Blowout: Ongc Gas Leak In Konaseema District Updates | Sakshi
Sakshi News home page

కోనసీమలో కలకలం.. భారీ శబ్దాలతో గ్యాస్‌ లీక్‌

Nov 17 2026 7:25 AM | Updated on Nov 17 2026 7:51 AM

Blowout: Ongc Gas Leak In Konaseema District Updates

సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో మరోసారి బ్లో అవుట్‌ కలకలం రేపుతోంది. మామిడికుదురు మండలం నగరంలో ఓఎన్జీసీ గ్యాస్‌ లీక్‌ కావడంతో రిగ్‌ దగ్గరలో ఉన్న ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. గ్యాస్‌ లీక్‌ను అదుపు చేసేందుకు అధికారుల యత్నిస్తున్నారు. భారీగా ఎగిసిపడుతూ చుట్టూ పక్కల ప్రాంతాలకు గ్యాస్‌ వ్యాపిస్తుంది. ఊరంతా గ్యాస్‌ వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ రిగ్ నుంచి భారీగా  గ్యాస్ లీకేజీ.. ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నగరం తాడివారి పుంతలో రీ-డ్రిల్లింగ్ సమయంలో భారీ శబ్దాలతో గ్యాస్‌ వెలువడుతోంది. మామిడికుదురు మండలంలోని గెద్దడ–మామిడికుదురు హైవే సమీపంలో ఉన్న నగరం తాడివారి పుంత ప్రాంతంలో ఓఎన్జీసీ రిగ్ నుంచి గ్యాస్ లీకేజీ తీవ్ర కలకలం రేపుతోంది. పాత రిగ్‌ వద్ద డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రీ-డ్రిల్లింగ్ పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దాలతో గ్యాస్‌ వెలువడింది.

కోనసీమ వాసుల మదిలో 2014 నగరం గ్యాస్ దుర్ఘటన చెరిగిపోలేదు. 2014లో ఇదే నగరం గ్రామంలో గెయిల్ సంస్థకు చెందిన గ్యాస్ పైప్‌లైన్ నుంచి లీకేజీ సంభవించి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 18 మంది అగ్నికి ఆహుతయ్యారు. డీప్ ఇండస్ట్రీస్ సంస్థ కార్యకలాపాలపై గతంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. డీప్ ఇండస్ట్రీస్ సంస్థ ఇరుసుమండ గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఏడాది జనవరి 5వ తేదీన భారీ బ్లోఅవుట్ జరిగింది.

గ్యాస్ లీకేజీని తక్షణమే పూర్తిస్థాయిలో నియంత్రించాలని.. పరిసర గ్రామాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల పునరుద్ధం కాకుండా  ఓఎన్జీసీ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న ఓఎన్జీసీ 216 హైవేపై రాకపోకలను పోలీసులు బంద్ చేశారు.

ఇదీ చదవండి: అన్నదాతకు ఆక్వాన్‌ కలవరం

 


 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement