గ్రామంలో క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు! | Gas Leak Telladevarapalli NTR District Incident Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గ్రామంలో క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు!

Nov 24 2026 11:29 AM | Updated on Nov 24 2026 11:37 AM

Gas Leak Telladevarapalli NTR District Incident Andhra Pradesh

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఎక్కడి నుంచి వస్తోందో తెలియని ఘాటైన వాసన.. ఊపిరి తీసుకోవడానికీ ఇబ్బందిగా మారిన పరిస్థితి.. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి పైలెట్‌ ప్రాజెక్టు వద్ద మంగళవారం తెల్లవారుజామున గ్యాస్‌ లీకేజీ కలకలం రేపింది.

పైలెట్‌ ప్రాజెక్టులోని 500 లీటర్ల సామర్థ్యం కలిగిన క్లోరినేషన్‌ గ్యాస్‌ ట్యాంకు నుంచి తెల్లవారుజాము నుంచే గ్యాస్‌ లీకవుతున్నట్లు గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో ఘాటైన వాసన వ్యాపించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ ఇంజన్లతో సహాయక చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే, గ్యాస్‌ లీకేజీని నియంత్రించేందుకు కొవ్వూరు నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పిస్తున్నట్లు, రెస్క్యూ టీమ్‌ చేరుకున్న తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నట్లుగా అగ్నిమాపక అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రాజధాని ప్రాంతంలో పర్యావరణ విధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement