సాక్షి, తాడేపల్లి: గురునానక్ జయంతి సందర్భంగా సిక్కులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవులంతా ఒక్కటేనని బోధిస్తూ.. ప్రేమ, శాంతి, సమానత్వం వంటి గొప్ప మానవీయ విలువలను.. కులమతాలకు అతీతంగా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గురునానక్. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా సిక్కు సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మానవులంతా ఒక్కటేనని బోధిస్తూ, ప్రేమ, శాంతి, సమానత్వం వంటి గొప్ప మానవీయ విలువలను కులమతాలకు అతీతంగా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గురునానక్. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా సిక్కు సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. https://t.co/0B8o1YPSco
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2026
ఇదీ చదవండి: అక్రమ మైనింగ్‌పై జగన్ ప్రభుత్వ చర్యలు భేష్


