హంగామా అంతా వీరిదే.. | GVMC New Governing Body Oath Ceremony TDP MLAs Absent | Sakshi
Sakshi News home page

హంగామా అంతా వీరిదే..

Nov 24 2026 11:26 AM | Updated on Nov 24 2026 11:36 AM

GVMC New Governing Body Oath Ceremony TDP MLAs Absent

విశాఖపట్నం: జీవీఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెజార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సుమారు 30 లక్షల జనాభా, 10 జోన్లు, 120 మంది కార్పొరేటర్లతో కూడిన జీవీఎంసీ నూతన పాలకవర్గం కొలువుదీరిన కార్యక్రమానికి అధికార కూటమిలోని టీడీపీకి చెందిన కీలక ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం విమర్శలకు తావిచ్చింది. 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పశి్చమ ఎమ్మెల్యే గణబాబు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇంతటి కీలక కార్యక్రమానికి వీరంతా ఎందుకు దూరంగా ఉన్నారన్నది చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంపై ఆసక్తి లేకనా? లేక హాజరైన ఎంపీ శ్రీభరత్, జనసేన ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుతో విభేదాలా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

టీడీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుతో కార్యక్రమంలో జనసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ప్రధానంగా కనిపించారు. డిప్యూటీ మేయర్‌ ఎన్నిక మొదలుకొని కార్యక్రమంలోని కీలక ఘట్టాల్లో వీరే చురుగ్గా వ్యవహరించారు. చివరకు ఫొటో సెషన్‌లోనూ టీడీపీకి చెందిన కార్పొరేటర్లు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి ఫొటోలు దిగాల్సిన పరిస్థితి నెలకొంది.  

ఇదీ చదవండి: ఎమ్మెల్యే నయన మోటమ్మ రాజీనామా?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement