పంచాయతీ ఎన్నికల్లోనూ పచ్చ గూండాల రాక్షసకాండకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నియంత్రించాల్సిన పోలీసులు పచ్చసేవకులుగా చెలరేగిపోతున్నారు. దాష్టికాలకు తలాడించడమే కాదు.. కోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ బెదిరింపులు, అరెస్టులు, నిర్బంధాలు, లాఠీచార్జిలతో పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక వెన్నుపోటు పార్టీ రౌడీలు అధికారమదంతో హింసాకాండకు తెగబడుతున్నారు.
అర్ధరాత్రి కిడ్నాప్ కలకలం
శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో అర్ధరాత్రి కిడ్నాప్ కలకలం
సర్పంచ్ అభ్యర్థి జెరిపిటి శ్రీనివాసులు కిడ్నాప్
శ్రీనివాసులును కిడ్నాప్ చేశారంటూ కూటమి నాయకులపై ఆరోపణలు
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి..
ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
టీడీపీ గూండాలు, పోలీసుల దాష్టికాలు..
ఎస్‌ఈసీ అండతో యథేచ్ఛగా దురాగతాలు
వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు
తాడిపత్రి దిగువపల్లిలో సర్పంచ్ అభ్యర్థి వాహనానికి నిప్పు
నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు అక్రమ నిర్బంధాలు
కోర్టు ఆదేశాలు ఉన్నా లెక్కచేయని ఖాకీలు
తిరుపతి జిల్లా:
- రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు చుక్కలు చూపించిన జనసేన కార్యకర్తలు
- పరిషత్ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికిన వారికి ఎలా సపోర్ట్ చేస్తారంటూ నిలదీత
- పంచాయతీ ఎన్నికల్లో చిట్వేల్ మండలం కొత్తపల్లి ప్రచారానికి వెళ్ళిన ఎమ్మెల్యే
- పరిషత్ ఎన్నికల్లో జనసేన పోటీలో ఉన్నా.. టీడీపీకి మద్దతు పలికి ఇప్పుడు ఎలా ప్రచారానికి వస్తారంటూ మహిళల నిలదీత
- నువ్వు అసలు ఏ పార్టీ ఎమ్మెల్యేవీ అంటూ నిలదీత
- ఆ రోజు టీడీపీ పోటీలో ఉందని ప్రచారానికి రాలేదని మండిపాటు
- ఇప్పుడు మళ్లీ ఎందుకు మా గ్రామం వచ్చారంటూ నిలదీసిన మహిళలు
- గ్లాసు గుర్తుకు ప్రచారం చేయాల్సిన మీరు టీడీపీకి ఎలా చేస్తారని నిలదీత
- నాది తప్పేనని ఒప్పుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్


