పవర్‌బ్యాంక్‌లో మంటలు | Power Bank Triggers Fire On Delhi-Chennai IndiGo Flight | Sakshi
Sakshi News home page

పవర్‌బ్యాంక్‌లో మంటలు

Oct 12 2026 5:08 AM | Updated on Oct 12 2026 5:08 AM

Power Bank Triggers Fire On Delhi-Chennai IndiGo Flight

ఢిల్లీ–చెన్నై ఇండిగో విమానంలో అలజడి.. ఆర్పివేసిన సిబ్బంది

శంషాబాద్‌ (హైదరాబాద్‌): ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడి పవర్‌­బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో ఆందోళన నెలకొంది. విమానాన్ని దారి మళ్లించి హైదరా­బా­ద్‌లో సురక్షితంగా ల్యాండింగ్‌ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరా­లివి. ఆదివారం మధ్యాహ్నం 1.14 గంటలకు ఢిల్లీ నుంచి చెన్నైకు ఇండిగో 6ఈ 6115 విమానం బయల్దేరింది. లగేజీ క్యాబిన్‌లో ఉన్న ప్రయాణికుడి బ్యాగ్‌లో ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో పొగలు రేగడంతో ప్రయాణికులు అప్రమత్తమ­య్యారు.

క్షణాల్లోనే మంటలు కూడా రేగడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ప్రయా­ణికులు, సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలు ఆర్పివేశారు. పైలట్‌కు సమాచారం అందించడంతో.. విమానాన్ని ఏటీసీ అనుమతి మేరకు శంషాబాద్‌ విమానాశ్రయానికి మళ్లించి మధ్యా­హ్నం 3.59 గంటలకు సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసి చెన్నై పంపుతున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement