వేల అడుగుల ఎత్తులో పిడుగు.. ఇండిగోకు తప్పిన ఘోర ప్రమాదం! | IndiGo Flight Escapes Major Disaster After Lightning Strike At 17000 Feet | Sakshi
Sakshi News home page

వేల అడుగుల ఎత్తులో పిడుగు.. ఇండిగోకు తప్పిన ఘోర ప్రమాదం!

Oct 8 2026 6:43 AM | Updated on Oct 8 2026 7:07 AM

IndiGo Flight Escapes Major Disaster After Lightning Strike At 17000 Feet

ఇండిగో విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకడంతో విమానం ముందుభాగంలోని రాడోమ్‌ దెబ్బతింది. ల్యాండింగ్‌ సమయంలో వడగళ్ల వాన కూడా ఎదురైంది. అయితే పైలట్లు పరిస్థితిని అదుపులో ఉంచి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానం 6E 625 బుధవారం ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. సుమారు 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకడంతో విమానం ముందుభాగంలోని రాడోమ్‌ దెబ్బతింది. ల్యాండింగ్‌ సమయంలో వడగళ్ల వాన కూడా ఎదురైంది. అయితే పైలట్లు పరిస్థితిని అదుపులో ఉంచి విమానాన్ని చౌధరీ చరణ్‌సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించారు. 

విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. విమానం షెడ్యూల్‌ సమయం కంటే 8 నిమిషాల ముందుగానే ల్యాండ్‌ కావడం గమనార్హం.

పిడుగుపాటు, వడగళ్ల వాన కారణంగా విమానం ముందుభాగంలోని రాడోమ్‌ దెబ్బతినడంతో దానిని వెంటనే గ్రౌండ్‌ చేశారు. విమానాన్ని తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టిన తర్వాతే తిరిగి నడిపించనున్నారు. ఇందుకు సంబంధించి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) దర్యాప్తు ప్రారంభించింది. సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించినట్లు ఇండిగో తెలిపింది. అవసరమైన నిర్వహణ పనులు పూర్తయ్యాక, నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన తర్వాత విమానం తిరిగి సేవల్లోకి వస్తుందని పేర్కొంది.

ఇటీవల కూడా ఇండిగో విమానానికి ఇలాంటి ఘటన ఎదురైంది. గత నెల గువాహటి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో టెయిల్‌ స్ట్రైక్‌కు గురైంది. బలమైన గాలులతో కూడిన ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ఇండిగో తెలిపింది.

ఇదీ చదవండి: ఈ వేడి ఇంతింతై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement