Ma, The Epitome Of Grace Under Pressure: Rahul Gandhi's Post On Emergency Landing - Sakshi
Sakshi News home page

ఆక్సిజన్ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ.. రాహుల్ భావోద్వేగ పోస్టు..

Jul 19 2023 7:07 PM | Updated on Jul 19 2023 7:46 PM

Rahul Gandhi Post On Emergency Landing After Opposition Meeting - Sakshi

భోపాల్‌: బెంగళూరులో విపక్ష భేటీ అనంతరం ఢిల్లీకి వెళుతుండగా.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో విమానంలో ఆక్సిజన్ తక్కువ అయింది. ఈ కారణంగా సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించారు. ఈ ఫొటోను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ షేర్ చేశారు. 'ఆపదలోనూ దయకు అమ్మే ఉదాహారణ' అని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. 

ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. పోస్టు చేసిన మొదటి గంటలోనే 1.8 లక్షల లైకులు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌​ అయింది. సాంకేతిక లోపం కారణంగా విమానం భోపాల్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయినట్లు భోపాల్‌ పోలీస్‌ కమిషనర్‌ హరినారాయణ్‌ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. 

సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. దాదాపు గంటన్నర సేపు ఎయిర్ పోర్టులో బస చేసిన తర్వాత మంగళవారం రాత్రి 9.35కి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 

ఇదీ చదవండి: దంచికొట్టిన వానలు.. నీటమునిగిన కార్లు.. ఒక్క రోజులోనే..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement