ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు | Indi​‍go Flight Makes Emergency Landing In Nagpur After Getting Bomb Threat | Sakshi
Sakshi News home page

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Jun 17 2025 12:50 PM | Updated on Jun 17 2025 1:03 PM

Indi​‍go Flight Makes Emergency Landing In Nagpur After Getting Bomb Threat

నాగపూర్‌: విమానాలకు బాంబు బెరిరింపు కాల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌  వచ్చింది. మంగళవారం ఉదయం కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో నాగపూర్‌లో ఇండిగో ఫ్లైట్‌ అత్యవసర ల్యాండింగ్‌ అయ్యింది. నాగపూర్‌లో ఇండిగో విమానాన్ని భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించారు. ఈ బెదిరింపు ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రోజుల క్రితం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానం బాంబు బెదిరింపుల నేపథ్యంలో యూటర్న్‌ తీసుకుంది. తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎల్‌హెచ్‌752 విమానం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం జర్మనీ నుంచి బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ కావాల్సి ఉంది.

కానీ, ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బాంబు బెదిరింపు మెయిల్‌ రావడంతో ల్యాండింగ్‌కు నిరాకరించారు. భద్రతా దృష్ట్యా, విమానాన్ని తిరిగి బయల్దేరిన విమానాశ్రయానికి లేదా సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించాలని సూచించారు. దీంతో.. లుఫ్తాన్సా విమానం తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌కు చేరుకుంది.  శుక్రవారం ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం బాంబు బెదిరింపు కారణంగా థాయిలాండ్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement