
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 767 ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
వీడియోలో బోయింగ్ విమానం ఎడమ ఇంజిన్ నుండి మంటలు రావడం కనిపిస్తోంది. అట్లాంటాకు వెళ్లాల్సిన ఈ డెల్టా ఎయిర్ లైన్స్ విమానం లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
❗️Boeing 787 Makes Emergency Landing in LA 🇺🇸 - Engine ON FIRE 🔥
Video claims to show a Delta Airlines flight bound for Atlanta on Friday making an emergency landing at LAX. The engine reportedly caught fire shortly after take-off.
📹 @LAFlightsLIVE https://t.co/t1HBVLDi0P pic.twitter.com/vYNgkpZJcq— RT_India (@RT_India_news) July 19, 2025
శుక్రవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ మంటల్లో చిక్కుకున్నట్లు గుర్తించడంతో.. అట్లాంటాకు వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమాన్నాన్ని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఎల్‌ఏఎక్స్)కి తిరిగి మళ్లించి, అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమాన ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, అగ్నిమాపక సిబ్బంది రన్‌వేపై మంటలను చల్లార్చడంతో ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు.
ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం ఈ విమానం విమానాశ్రయం నుండి బయలుదేరిన వెంటనే ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. విమాన సిబ్బంది అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించేలా మార్గనిర్దేశం చేసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానం దాదాపు 25 సంవత్సరాల క్రితం నాటిది.
డెల్టా ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం ఈ ఏడాది ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏప్రిల్‌లో ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా విమానం మంటల్లో చిక్కుకుంది. అట్లాంటాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.