మధ్యప్రదేశ్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..

Madhya Pradesh Cm Shivraj Singh Helicopter Emergency Landing - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాలతో పైలట్ ఇలా చేశారు. హెలికాప్టర్ మనావర్ నుంచి ధార్ వెళ్తుండగా సమస్య రావడంతో తిరిగి మనావర్‌కే వచ్చింది. ఆదివారం ఈ ఘటన జరిగింది.  ఈమేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

హెలికాప్టర్ నిలిచిపోవడంతో సీఎం రోడ్డు మార్గం ద్వారా బస్సులోనే ధార్‌కు వెళ్లారు.  అక్కడ ఏర్పాటు చేసిన ఓ ర్యాలీకి హాజరై ప్రసంగించారు. సాంకేతిక కారణాలు తలెత్తిన ఈ హెలికాప్టర్ ఓ ప్రైవేటు కంపెనీకి చెందింది.
చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్..

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top