రుద్ర సాయుధ హెలికాప్టర్‌ని నడిపిన తొలి మహిళా పైలట్‌..! | Hansja Sharma Armys first woman pilot to fly the Rudra armed helicopter | Sakshi
Sakshi News home page

రుద్ర సాయుధ హెలికాప్టర్‌ని నడిపిన తొలి మహిళా పైలట్‌..! ఒంటరి తల్లి..

Jan 28 2026 5:13 PM | Updated on Jan 28 2026 5:43 PM

Hansja Sharma Armys first woman pilot to fly the Rudra armed helicopter

సైన్యంలో చేరడం అంటే అంత ఆషామాషి కాదు. తీరా అందులో జాయిన్‌ అయ్యాక అక్కడ కఠిన శిక్షణను తట్టుకుని పూర్తి స్థాయిలో సక్సెస్‌ అవ్వడం మాటలు కాదు . అందులోనూ ఏవియేషన్‌ రంగంలో ఓ సాయుధ హెలికాప్టర్‌కి పైలట్‌గా వ్యవహరించడం అంటే..ఎన్ని సవాళ్లు ఎదుర్కొనలో చెప్పాల్సిన పనిలేదు. ఇంతవరకు అంతటి కష్టతరసాధ్యమైన బాధ్యతలను పురుషులే నిర్వర్తించారు. తొలిసారి అలాంటి విధుల్లో ఒక మహిళ రావడం ఇదే తొలిసారి. అలాంటి ఘనతను అందుకు "శర్మ జీ కి బేటి". గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె స్టోరీ ప్రేరణగా నిలిచింది. ఎవరామె..? ఈ రంగాన్ని ఎలా ఎంచుకుం

రుద్ర సాయుధ హెలికాప్టర్‌ను నడిపిన భారత సైన్యం తొలి మహిళా పైలట్‌గా కెప్టెన్ హంస్జా శర్మ చరిత్ర సృష్టించారు. శర్మ కెరీర్‌ జర్నీలో తిరస్కరణలు, శస్ట్ర చికిత్సలు ఉన్నాయి. జమ్మూలో పుట్టి పెరిగిన ఆమె నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ శిక్షణా పాఠశాల (CAATS)లో తన శిక్షణా కోర్సులో అగ్రస్థానంలో నిలిచింది. 

ఉత్తమ పోరాట విమాన చోదకుడికి ఇచ్చే సిల్వర్ చిరుత ట్రోఫీని అందుకున్న తొలి అధికారిణి ఆమె. ఇది భారత ఆర్మీ ఏవియేషన్‌కు తొలి రికార్డు కూడా. ఈ ఏడాది రాజస్థాన్‌ ఆర్మీ డే పరేడ్‌లో 251 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించడమే గాక హెలినా క్షిపణి వ్యవస్థను ప్రదర్శించింది.

జమ్మూ నుంచి ఆర్మీ ఏవియేషన్‌ వరకు..
మార్చి 9, 1998న జమ్మూలో జన్మించిన కెప్టెన్ శర్మ బర్నాయ్‌లోని సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె జమ్మూలోని పరేడ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత భారత సైన్యంలోకి ఎంపికయ్యే ముందు జమ్మూ విశ్వవిద్యాలయంలో జువాలజీ విభాగంలో చేరింది. 

అక్కడ నుంచి భారత సైన్యంలోకి చేరడానికి ఆమె పలు సవాళ్లు ఎదుర్కొంది. మొదటగా తాత్కలిక తిరస్కరణలను ఫేస్‌చేసింది. ఆ క్షణంతో తన కెరీర్‌ ముగిపోయిందనుకుంది. కానీ ఆమె అచంచలమైన సేవ, పట్టుదల మనస్తత్వం తిరిగి తన ఒంటిమీదకు యూనిఫాం వచ్చేలా చేశాయి. 

సింగిల్‌ మదర్‌ సంరక్షణలో..
సీనియర్ జర్నలిస్ట్, సింగిల్‌ మదర్‌ రష్మి శర్మ తన పిల్లలను పెంచడానికి అన్నింటిని అమ్మేశానన్నారు. ప్రస్తుతం తన కూతురు హంసజ తనను ఉద్యోగం మానేయమని అంటుంది. అయితే తాను జర్నలిస్ట్‌ని కాబట్టి పనిచేస్తే..తనకు చేతనైనంత ఇతరులకు సాయం చేయగులుగుతానని అంటోందామె. తన కూతురు కూడా ఇతర సైనికురాలి లాంటిదేనని అన్నారు. వాళ్లు దేశం కోసం త్యాగం చేస్తే..తాను అలాంటి త్యాగాలే చేసిన తల్లినని ఆమె గర్వంగా చెప్పారు. 

తాను శత్రువుల ముందు ధైర్యంగా నిలబడి తగిన జవాబు ఇవ్వడానికి సాహసించే ప్రతిసైనికుడిని చూసి గర్విస్తున్నాని అన్నారామె. నిజానికి ఏఎల్‌హెచ్‌లో ప్రయాణించడం అంటే బహిరంగ ఆకాశంలో ప్రయాణించడం లాంటిదని, చాలా భయంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో హంసజకు మరిన్ని బాధ్యతలు, సవాళ్లు ఎదరవ్వుతాయని..వాటన్నింటి ఆమె విజయవంతంగా ఎదుర్కొగలదని నమ్మకంగా చెప్పారు హంసజ తల్లి రష్మి శర్మ.

(చదవండి: దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!)



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement