సెక్యూరిటీ అలర్ట్‌.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ | Akasa Air flight diverted to Ahmedabad after security alert | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ అలర్ట్‌.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Jun 3 2024 12:27 PM | Updated on Jun 3 2024 12:31 PM

Akasa Air flight diverted to Ahmedabad after security alert

ఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరిన అకాసా ఎయిర్ విమానానికి సెక్యూరిటీ అలెర్ట్‌ రావటం కలకలం రేపింది. దీంతో ఆ విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ముంబైకి 186 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక వచ్చింది.

 

దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది 10.13 గంటలకు దారి మళ్లించి అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ప్రయాణికులందరినీ ఫ్లైట్‌ నుంచి దించివేశారు.

‘ఫైట్‌ కెప్టెన్‌ అన్ని అత్యవసర సూచనలు పాటించారు. సురక్షింతంగా అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ చేశారు. అకాశ్‌ ఫ్లైట్‌.. సెఫ్టీ, సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ పాటించింది’ అని అకాసా ఎయిర్ అధికార ప్రతినిధి  వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement