సోనియా, రాహుల్‌ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Aircraft carrying Sonia Gandhi Rahul Gandhi makes emergency landing at Bhopal airport - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌​ అయింది. వారి విమానం భోపాల్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయినట్లు భోపాల్‌ పోలీస్‌ కమిషనర్‌ హరినారాయణ్‌ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. అయితే ఎయిర్‌ప్లేన్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రతికూల వాతావరణమే కారణంగా తెలుస్తోంది. 

కాగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయినట్లు తెలిసింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ విషయమై వివరాలు తెలుసుకుంటున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శోభ ఓజా తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top