ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం | Air India Patna-Delhi flight makes emergency landing | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

Jun 28 2018 5:24 PM | Updated on Jul 11 2019 7:49 PM

Air India Patna-Delhi flight  makes emergency landing - Sakshi

ఎయిరిండియా విమానం ( ఫైల్‌ ఫోటో)

సాక్షి,పట్నా: ఎయిరిండియా విమానానికి భారీ  ప్రమాదం తప్పింది. విమానానికి అకస్మాత్తుగా పక్షి అంతరాయం కల్పించడంతో అత్యవసరం లాండ్‌ చేయాల్సి వచ్చింది.  పట్నా ఎయిర్‌పోర్ట్‌లో  గురువారం ఈ సంఘటన చోటు  చేసుసుకుంది.  ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుని సురక్షితంగా విమానం కిందికి దిగడంతో   ప్రయాణీకులు, సిబ్బంది  భారీ ఊరట చెందారు. దాదాపు 124 మంది ప్రయాణికులతో పట్నా - ఢిల్లీ ఎయిరిండియా విమానం ఈ భారీ ప్రమాదంనుంచి తప్పించుకుంది.  కాగా   కేవలం ఒక చిన్న పక్షి ఢీ కొనడం వలన పెద్ద పెద్ద విమానాలు కూలిపోయిన ఘటనలు గతంలో అనేకం చోటు  చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement