కారుపై పడ్డ హెలికాఫ్టర్‌.. ఉత్తరాఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం | Helicopter En Route Kedarnath Makes Emergency Landing in Uttarakhand | Sakshi
Sakshi News home page

కారుపై పడ్డ హెలికాఫ్టర్‌.. ఉత్తరాఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం

Jun 7 2025 3:18 PM | Updated on Jun 7 2025 4:17 PM

Helicopter En Route Kedarnath Makes Emergency Landing in Uttarakhand

ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం తప్పింది. అత్యవసరంగా రోడ్డుపై హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ అయ్యింది. ల్యాండింగ్‌ సమయంలో  హెలికాప్టర్‌ వెనుక భాగం కారుపై పడింది. హెలికాఫ్టర్‌లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్‌, కారు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.

కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ శనివారం సాంకేతిక లోపం కారణంగా రుద్రప్రయాగ జిల్లాలోని గుప్త్ కాశిలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని.. అదృష్టవశాత్తూ, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఏడీజీ వి.మురుగేషన్ తెలిపారు.

క్రెస్టెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నడిపే హెలికాప్టర్ సిర్సి నుండి కేదార్‌నాథ్ వైపు ప్రయాణీకులతో వెళ్తుండగా.. సాంకేతిక సమస్య ఏర్పడటంతో ముందుగానే అప్రమత్తమైన పైలట్.. హెలిప్యాడ్‌కు చేరుకోకుండా.. సమీపంలోని రహదారిపై ల్యాండ్‌ చేశారు.

ఎవరికి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేదార్‌నాథ్‌కు షటిల్ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని.. ఆ ప్రాంతంలోని ఇతర హెలికాప్టర్ సేవలకు ఎటువంటి అంతరాయం లేదని అధికారులు వెల్లడించారు.

ఉత్తరాఖండ్ లో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement