Travis Head, His Pregnant Fiancee Escape Death Emergency Landing of The Plane - Sakshi
Sakshi News home page

Travis Head: చావు నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆసీస్‌ క్రికెటర్‌

May 9 2022 8:31 AM | Updated on May 9 2022 9:19 AM

Travis Head His Pregnant Fiancee Escape Death Emergency Plane Landing - Sakshi

ఆస్ట్రేలియా క్రికెటర్‌ ట్రెవిస్‌ హెడ్‌, అతని భార్య జెస్సికా డేవిస్‌ తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు. కాగా ట్రెవిస్‌ హెడ్‌ భార్య ఆరు నెలల గర్భవతి. హాలిడే వెకేషన్‌ను ఎంజాయ్‌ చేయడానికి ట్రెవిస్‌ హెడ్‌.. జెస్సీకా డేవిస్‌తో కలిసి మాల్దీవ్స్‌ వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపిన వీరిద్దరు ఆదివారం ఆస్ట్రేలియాకు తిరుగుపయనమయ్యారు.


ఇంకో 45 నిమిషాల్లో గమనం చేరుకుంటుదన్న దశలో ఫ్లైట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో పైలెట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాలని భావించాడు. అయితే మొదటి ప్రయత్నంలో ఫ్లైట్‌ను ల్యాండింగ్‌ చేయడంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో ల్యాండింగ్‌ చేసినప్పటికీ స్లిడ్‌ అయిన ఫ్లైట్‌ పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. 


ఈ విషయాన్ని ట్రెవిస్‌ హెడ్‌ భార్య జెస్సీకా డేవిస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ''హాలిడే వెకేషన్‌ను సరదాగా గడిపాం. ఆస్ట్రేలియాకు తిరుగపయనమవ్వడానికి మాల్దీవ్స్‌లో ఫ్లైట్‌ ఎక్కాం. గంట ప్రయాణంలో 30 నిమిషాలు పూర్తైన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దేవుని దయవల్ల మాకు ఏం కాలేదు. నా బిడ్డ ఈ లోకాన్ని చూడకుండానే చనిపోతానేమోనని అనిపించింది. ఆ తర్వాత నాలుగు గంటల పాటు రెస్క్యూ ప్లేన్‌ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మాల్దీవ్స్‌ రాజధాని మాలీలో మాకు వసతి ఏర్పాటు చేసి మరో ఫ్లైట్‌లో ఆస్ట్రేలియాకు తీసుకొచ్చారు.'' అని చెప్పుకొచ్చింది. ఇక ట్రెవిస్‌ హెడ్‌ ఆస్ట్రేలియా తరపున 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆసీస్‌ తరపున 26 టెస్టులు, 45 వన్డేలు, 17 టి20 మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: Yuvraj SIngh: కొందరు పగబట్టారు.. అందుకే టీమిండియా కెప్టెన్‌ కాలేకపోయా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement