Air India Flight: ఇంజిన్‌ నుంచి ఆయిల్ లీక్.. ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్.. 

Air India Flight Oil Leak Emergency Land Sweden Stockholm - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం స్వీడన్‌ స్టాక్‌హోమ్‌లో అ‍త్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపంతో ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడం వల్ల విమానాన్ని  స్వీడన్‌కు దారిమళ్లించాల్సి వచ్చింది. ఫ్లైట్‌లో మొత్తం 300 మంది ప్రయాణికులున్నారు.

అయితే విమానంలో అందరూ సురక్షితంగానే ఉన్నారని, స్టాక్‌హోం విమానాశ్రయానికి ఫైర్ ఇంజిన్లకు కూడా తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయిల్ లీక్‌ కారణంగా విమానం రెండో ఇంజిన్ ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని డీజీసీఏ సీనియర్ అధికారి చెప్పారు. సమస్యను గుర్తించామని, ఇన్‌స్పెక్షన్ జరుగుతోందని పేర్కొన్నారు.

సోమవారం కూడా న్యూయార్క్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం లండన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. మెడికల్ ఎమర్జెన్సీ  కారణంగా దీన్ని దారిమళ్లించారు.
చదవండి: స్నూపింగ్‌ కేసు: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు భారీ షాక్..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top