హైవేపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Flights Emergency Landing Trial Run Successful In Bapatla District - Sakshi

మేదరమెట్ల(బాపట్ల జిల్లా): కొరిశపాడులోని పి.గుడిపాడు సమీపంలో జాతీయ రహదారిపై విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. జె.పంగులూరు మండలంలోని రేణింగివరం నుంచి కొరిశపాడు వరకు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఏర్పాటు చేశారు.

ట్రయల్‌ రన్‌ కారణంగా గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలు అద్దంకి వైపునకు.. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రేణింగివరం వద్ద నుంచి అద్దంకి వైపునకు మళ్లించారు. ట్రయల్‌ రన్‌ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీఐ రోశయ్య, భారత వైమానికి దళం గ్రూప్‌ కెప్టెన్‌ ఆర్‌.ఎస్‌. చౌదరి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్‌ఐలు శివకుమార్, వెంకటేశ్వరరావు, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


చదవండి: గుడివాడపైనే గురెందుకు? రెచ్చగొడుతున్నదెవరు?   

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top