శ్రీలంక విమానంలో సాంకేతిక లోపం: చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌  | Sakshi
Sakshi News home page

శ్రీలంక విమానంలో సాంకేతిక లోపం: చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ 

Published Fri, Jul 15 2022 9:04 PM

Sri Lankan Airlines flight makes emergency landing at Chennai airport - Sakshi

సాక్షి, చెన్నై: శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది.  చెన్నై నుంచి కొలంబోకు  బయలు దేరిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఈ రోజు (జూలై 15) ఉదయం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ప్రయాణీకులు అంతా క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.

 కొలంబో-చెన్నై విమానం  (UL121)లో లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో అత్యవసర ప్రోటోకాల్‌ ప్రకారం  రన్‌వే వద్ద విమానాన్ని ల్యాండ్‌  చేశారని  చెన్నై విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల చెన్నై నుంచి వచ్చే ఏ ఇతర సర్వీసులపై ఎలాంటి ప్రభావం పడలేదని  వెల్లడించాయి. 

కాగా ద్వీప దేశం శ్రీలంక ఆర్థిక  రాజకీయ సంక్షభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశ ఆర్థిక మాంద్యంపై సామూహిక నిరసనల  మధ్య శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే  దేశంవిడిచిపోవంతో  మరింత తీవ్ర గందర గోళ పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement