హెలికాప్టర్‌ క్రాష్‌ ల్యాండింగ్‌: 13 మంది మృతి | 13 Killed In Minister's Quake Zone Copter Crash | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌ క్రాష్‌ ల్యాండింగ్‌: 13 మంది మృతి

Feb 18 2018 2:01 AM | Updated on Feb 18 2018 11:00 AM

13 Killed In Minister's Quake Zone Copter Crash - Sakshi

మెక్సికో సిటీ: భూకంపం వచ్చిన ప్రాంతంలో పర్యటించేందుకు మెక్సికో హోంమంత్రి హెలికాప్టర్‌లో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారు. శుక్రవారం మెక్సికో హోం మంత్రి అల్ఫోన్సో నవరెట్, ఓక్సాక స్టేట్‌ గవర్నర్‌ అలెజాండ్రో మురాత్‌లు సైనిక హెలికాప్టర్‌లో వెళ్తుండగా దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. దీంతో హెలికాప్టర్‌ దిగిన ప్రాంతంలో ఉన్న 12 మంది అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మంత్రి, గవర్నర్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement