డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భూకంపం తీవ్ర కలకలం రేపింది. ఉత్తరకాశీ జిల్లాలో ఈ రోజు శనివారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్లు తెలిపింది. భూకంప కేంద్రం ఉత్తరకాశీ ప్రాంతంలో భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం తెలిపింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ధన ప్రాణ నష్టం సభవించనట్లు తెలుస్తోంది.
కాగా ఒక్కరోజు వ్యవధిలో భూమి రెండోసారి కంపించింది. అంతకుముందు సుమారు నాలుగు గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని బాగేశ్వర్ జిల్లాలోనూ స్వల్ప తీవ్రతతో భూమి కంపించింది. మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల 53 సెకన్ల సమయంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.8గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఒక్కరోజులోనే రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ఇదీ చదవండి:రాహుల్ హెచ్చరిక


