విమానానికి తప్పిన ప్రమాదం, షాకైన స్థానికులు  | GoAir flight makes emergency landing in Guwahati | Sakshi
Sakshi News home page

విమానానికి తప్పిన ప్రమాదం, షాకైన స్థానికులు 

Dec 23 2019 4:52 PM | Updated on Dec 23 2019 4:55 PM

 GoAir flight makes emergency landing in Guwahati - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, కోలకతా: గో ఎయిర్‌ విమానానికి భారీ ప్రమాదం తప్పింది.  టేక్‌ ఆఫ్‌ తీసుకున్న కొద్ద సమయానికే  సాంకేతిక లోపం తలెత్తడంతో గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బర్దోయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.  అయితే  విమానంలో ఉన్న మొత్తం 157 మంది సురక్షితంగా బయటపడ్డారు. గోవహతి-కోల్‌కతా  గోఎయిర్ జి 8546  విమానం ఉదయం 11:15 గంటలకు గువహతి విమానాశ్రయం నుండి బయలుదేరింది. వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ సందర్భంగా భారీ శబ్దం వినపడిందని  విమానాశ్రయంలోఉన్నవారు  చెప్పారు. లోహపు ముక్కలను కనుగొన్నామని స్థానికులు తెలిపారు. విమానం క్రాష్  అయినట్టుగా పెద్ద శబ్దం  వినగానే తాను షాక్  అయ్యానని స్థానికుడు ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement