స్పైస్‌జెట్‌ విమానానికి తప్పిన ప్రమాదం

SpiceJet plane from Dubai makes emergency landing in Jaipur after tyre burstf - Sakshi

జైపూర్ :  రాజస్థాన్‌లో స్పైస్‌జెట్‌ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 189 మంది ప్రయాణికులతో వెళుతున‍్న దుబాయ్‌-జైపూర్‌ స్పైస్ జెట్  58 విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. పైలట్‌ అప్రమత్తతతో  ప్రయాణికులు సిబ్బంది  ప్రాణాలతో బయటపడ్డారు.  బయలుదేరిన కొద్దిసేపటికే లోపాన్ని గుర్తించిన పైలట్‌ విమానాన్ని సురక్షితంగా  ల్యాండ్‌ చేశారు. 

టేక్‌ ఆఫ్‌ తీసుకున్నకొద్ది సేపటికే విమానానికి చెందిన ఒక  టైర్‌ పేలిపోవడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. అయితే  విమాన సిబ్బందితోపాటు ప్రయాణీకులందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.  బుధవారం ఉదయం జైపూర్‌ విమానాశ్రయంలో  ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు నిపుణుల బృందం పరిశీలిస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top