గిరికీలు కొట్టిన హెలికాప్టర్‌ | Sakshi
Sakshi News home page

గిరికీలు కొట్టిన హెలికాప్టర్‌

Published Sat, May 25 2024 5:22 AM

Chopper spins mid-air during Kedarnath landing

కేదార్‌నాథ్‌: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శుక్రవారం ఉదయం పెనుప్రమాదం తప్పింది.  హెలికాప్టర్‌ హైడ్రాలిక్‌ వ్యవస్థ విఫలం కావడంతో అత్యవసర ల్యాండయ్యింది. కెస్ట్రెల్‌ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలికాప్టర్‌ సిర్సి నుంచి ఆరుగురు భక్తులతో కేదార్‌నాథ్‌కు చేరుకుంది. 

ల్యాండింగ్‌ సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్‌ వేగంగా గిరికీలు కొట్టింది. హెలిప్యాడ్‌ వద్ద ఉన్న వాళ్లంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.  పైలట్‌ కల్పేశ్‌ చాకచక్యంగా వ్యవహరించి, హెలిప్యాడ్‌  పక్కనే 100 మీటర్ల దూరంలోని ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. అందరూ సురక్షితంగా కిందికి దిగారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement