ధ్రుతి కేసరికి 5 వికెట్లు
సాక్షి, హైదరాబాద్: యువ బౌలర్ ధ్రుతి కేసరి ఐదు వికెట్లతో సత్తా చాటినా... హైదరాబాద్ జట్టుకు పరాజయం తప్పలేదు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం ఏఓసీ సెంటర్‌లో జరిగిన హోరాహోరీ వన్డే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ జట్టు 1 వికెట్ తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది.
మొదట హైదరాబాద్ 44.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. సంధ్య గోర (50; 9 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరాఖండ్ జట్టు 37 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.
నందిని కశ్యప్ (63 బంతుల్లో 39; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్ కేసరి ధ్రుతి 10 ఓవర్లలో 44 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ధ్రుతి ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఉత్తరాఖండ్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని అతికష్టంపై ఛేదించి గెలిచింది.
ఇదీ చదవండి: అనాహత్ ఓటమి
న్యూఢిల్లీ: భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ న్యూయర్క్ వేదికగా జరిగిన ‘స్పోర్ట్ టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్’ రెండో రౌండ్‌లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 31వ ర్యాంకర్ అనాహత్ 11–6, 11–6, 2–11, 8–11, 6–11తో ప్రపంచ ఏడో ర్యాంకర్ సతోమి వటనాబె (జపాన్) చేతిలో పరాజయం పాలైంది.
తొలి రెండు గేమ్‌ల్లో అది్వతీయ ప్రదర్శనతో సంచలనం నమోదు చేసేలా కనిపించిన 17 ఏళ్ల అనాహత్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది.


