కోల్‌కతా: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యిదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం కోల్‌కతాకు చేరుకుంటుండగా, విమానం ఇంజిన్లలో ఒకటి పనిచేయకపోవడాన్ని పైలట్ గుర్తించి, విమానాశ్రయంలో ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
విమానంలో తలెత్తిన సమస్యను గుర్తించిన పైలట్ తక్షణం కోల్‌కతా విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. తరువాత ముంబై నుండి కోల్‌కతాకు ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎస్‌జీ 670 విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. రాత్రి 11:38 గంటలకు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నారు. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందితో కూడిన విమానాశ్రయ అత్యవసర ప్రతిస్పందన బృందాన్ని వెంటనే మోహరించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
A Spice Jet flight SG670, from Bombay to Kolkata made an emergency landing as it reported failure in one of the engines. The flight landed safely, and the full emergency has been withdrawn at 23.38: Kolkata Airport Officials
— ANI (@ANI) November 9, 2025
గత నెలలో కోల్‌కతా నుండి శ్రీనగర్‌కు వెళ్లే ఇండిగో విమానం ఇంధన లీక్ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఆ ఇండిగో విమానం 6ఈ-6961లో 166 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారికి విమానయాన అధికారులు వసతి సౌకర్యం కల్పించారు. అవసరమైన మరమ్మతుల అనంతరం విమానం తిరిగి దాని గమ్యస్థానానికి చేరుకుంది.
ఇది కూడా చదవండి: ‘హజ్’ కోటా నిర్థారణ.. ఎందరు వెళ్లొచ్చంటే..


