న్యూఢిల్లీ: హజ్ యాత్ర-2026కు సంబంధించి భారత్ కొటా ఎంతనేది నిర్ణారణ అయ్యింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సౌదీ అరేబియాలో తన అధికారిక పర్యటన సందర్భంగా జెడ్డాలో ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేశారు. 2026 హజ్ యాత్రకు భారత యాత్రికుల కోటా ఇప్పుడు 1,75,025గా నిర్ధారణ అయ్యింది.
మంత్రి రిజిజు నవంబర్ 7 నుండి 9 వరకు సౌదీ అరేబియాలో అధికారిక పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా సౌదీ హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరుదేశాల సమన్వయం, లాజిస్టిక్స్ ఏర్పాట్లు మొదలైన అంశాలపై దీనిలో చర్చించారు. భారత యాత్రికుల కోసం అవసరమైన ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
A significant step in deepening the India–Saudi Arabia ties 🇮🇳🤝🇸🇦
Held a Bilateral Meeting & signed the Bilateral Haj Agreement with H.E. Dr. Tawfiq bin Fawzan Al-Rabiah, Minister of Hajj & Umrah, Kingdom of Saudi Arabia. Haj Quota of 175,025 has been secured for Indian Pilgrims… pic.twitter.com/Yonkj8U0LT— Kiren Rijiju (@KirenRijiju) November 9, 2025
ఈ సమావేశం తర్వాత, రెండు దేశాల ప్రతినిధులు హజ్- 2026 కోసం ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేశారు. హజ్‌లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను, టెర్మినల్ వన్, హరమైన్ స్టేషన్‌తో సహా జెడ్డా, తైఫ్‌లోని హజ్, ఉమ్రా తదితర ప్రదేశాలను మంత్రి సందర్శించారు. భారత్-సౌదీ అరేబియా సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని రిజిజు ‘ఎక్స్’ లో రాశారు.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో కేరళ బస్సులు బంద్


