క్రిస్మస్‌ కాంతులు.. భిన్నస్వరాలు! | Christmas Celebrations 2025 Viral india | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ కాంతులు.. భిన్నస్వరాలు!

Dec 25 2025 10:58 AM | Updated on Dec 25 2025 11:44 AM

Christmas Celebrations 2025 Viral india

ప్రేమ, శాంతి, దయ అనే సార్వత్రిక విలువలు ప్రతిబింబించేది క్రిస్మస్‌ పండుగ. అందుకే ప్రపంచవ్యాప్తంగా.. అన్నిమతాల వాళ్లు ఈ పండుగను గౌరవిస్తారు. భారత్‌లోనూ క్రిస్మస్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు.. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక క్రిస్మస్‌ ట్రీలు, బహుమతులు, కేక్‌ల హడావిడి.. చాలా ఇళ్లలో కనిపిస్తోంది. అదే సమయంలో.. కొన్నిచోట్ల అసాధారణ దృశ్యాలు కనిపించాయి. 

ఒకవైపు శాంటాక్లాజ్‌ వేషధారణలో క్రైస్తవులు ర్యాలీగా వెళ్తున్నారు. అదే సమయంలో.. వాళ్లకు అనుకోని దృశ్యం తారసపడింది. కేరళ సంప్రదాయ వాయిద్యం చండా వాయిస్తూ ఆ ఎదురు రోడ్డులో మరో ఊరేగింపు వచ్చింది. పైగా శాంటాక్లాజ్‌ టోపీలతో చండా బృందం సంప్రదాయ పంచెకట్టులో కనిపించింది. అది చూసి అవతలివాళ్లలో కొందరు నిర్ఘాంతపోగా.. మరికొందరు మాత్రం ఆ వైబ్‌కు ఊగిపోతూ కనిపించారు. 

మరో ఘటనలో.. అస్సాం పినాగావ్‌ నల్బరి ఏరియాలో హిందూ సంఘాల ఓ క్రిస్టియన్‌ స్కూల్‌లోకి చొరబడి.. అక్కడి క్రిస్మస్‌ వేడుకల సామాగ్రిని తగలబెట్టారు. ఆ సమయంలో విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు జై శ్రీరామ్‌.. జై హిందూ రాష్ట్ర నినాదాలు చేశారు. 

స్వామి వివేకానంద బాటలోనే.. బేలూరు రామకృష్ణ మఠం నిర్వహకులు పయనిస్తున్నారు. ప్రతీ ఏడులాగే.. ఈసారి క్రిస్మస్‌కు జీషూ పూజ నిర్వహించారు. 

ప్రపంచమంతా ప్రశాంతంగా క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించుకుంటోంది. అయితే పైన చెప్పుకున్న దృశ్యాలు కలిసినప్పుడు మనకు కనిపించేది భిన్నత్వంలో ఏకత్వం. ఇదే కదా మన భారతం..! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement