Indigo Flight Emergency Landing: కరాచీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Sharjah Hyderabad IndiGo Flight diverted to Pakisthan Karachi Airport After Glitch - Sakshi

కరాచీ: షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది.

'షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానం 6E-1406ను కరాచీ వైపు మళ్లించాం. సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించి పైలట్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.  విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తాం.' అని ఇండిగో ప్రకటనలో తెలిపింది. 

రెండు వారాల వ్యవధిలోనే భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ కావడం గమనార్హం. జులై5న న్యూఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌ జెట్ విమానం కూడా సాంకేతిక సమస్య వల్ల కరాచీలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. కొన్ని గంటల పాటు అక్కడే ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top