Karachi airport
-
కరాచీ ఎయిర్‌పోర్టు లాక్డౌన్.. పెట్రోల్ బంక్‌లు బంద్!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా భారత్ దాడుల కారణంగా కరాచీ ఎయిర్‌పోర్టులో లాక్డౌన్ విధించారు. కరాచీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణీకుల తరలిస్తున్నట్టు సమాచారం. బ్లాక్ అవుట్ ప్రకటించారు. అలాగే, పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు.. భారత్ ముప్పెట దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలం మూసివేశారు. అలాగే, భారత్‌తో యుద్ధం కారణంగా పాకిస్తాన్లో కొరత మొదలైంది. తాజాగా ఇస్లామాబాద్‌లో 48 గంటలపాటు పెట్రోల్‌బంక్‌లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ప్రజలు అల్లాడిపోతున్నారు.All PETROL PUMPS in Islamabad SHUTDOWN for 48 hrsPaaijaan tel khatam hogya 😭#IndiaPakistanWar pic.twitter.com/D9hkvnEuQM— Dev Madan Chronicles (@DMC_0001) May 10, 2025 🚨#BREAKING!!! Completely BLACKED OUT, this is the scene at Karachi Airport after Pakistani airspace cleared,RT pic.twitter.com/Vpt8evRQFG— G7 News (@G7NEWSX) May 10, 2025ఇదిలా ఉండగా.. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, మిస్సైల్‌తో పాక్ దాడి చేయడంతో.. భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. పాకిస్తాన్‌లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. పాక్ సైన్యం హెడ్‌క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్ఖాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో భారత్ దాడులకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది.Pakistani airspace is reportedly closed again. A friend is stuck at Karachi Airport — complete blackout, no updates. Situation tense pic.twitter.com/tww6jVWSG2— Nasir (@khan_nasir19) May 9, 2025 So now it's in Karachi.. blasts are happening in air..Near old airport..#Pakistan #IndiaPakistanWar #PakistanZindabad pic.twitter.com/3gKbLY9lqn— Sarah Peracha (@sarahperacha) May 10, 2025 ఇక, రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మరోసారి భారత్‌పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. ఇక తాజాగా శనివారం తెల్లవారుజాము నుంచి పాక్ తిరిగి దాడులు చేయడంతో భారత్ తిప్పికొట్టింది. Seems so drones are being hit towards Karachi airport. Hug blasts heard towards Karachi airport. pic.twitter.com/ikFvyMHpsg— Nazim Abbas (@NazimAbbas_1) May 10, 2025 Visuals Coming From Karachi.کراچی Malir airport سے مناظر۔ pic.twitter.com/PgGmfsGY5M— The Awazaar Sain (@adeelzsiddiqui) May 10, 2025 -
హైదరాబాద్ విమానం పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగింది?
ఇస్లామాబాద్: భారత్‌కు చెందిన 12 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ చార్టర్ ఫ్లైట్ పాకిస్థాన్, కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఆ విమానం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కరాచీలో దిగినట్లు అంతర్జాతీయ మీడియాలు వెల్లడించాయి. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే 12 మంది ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అయితే, కరాచీలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు గల కారణాలు తెలియరాలేదు. విమానం ల్యాండింగ్‌ను భారత పౌర విమానయాన సంస్థ(సీఏఏ) ధ్రువీకరించింది. అంతర్జాతీయ ఛార్టర్ ఫ్లైట్ భారత్ నుంచే వెళ్లిందని, ఆ తర్వాత సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొంది. గత నెలలో సాంకేతిక సమస్యలతో రెండు విమానాలు కరాచీలో దిగిన తర్వాత ఈ ఛార్టర్ విమానం ల్యాండింగ్ అయింది. అంతకు ముందు స్పైస్‌జెట్ ఢిల్లీ-దుబాయ్ విమానం జులై 5న కరాచీకి మళ్లించారు. అలాగే.. షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మరో విమానం జులై 17న కరాచీలో దిగింది. ఇదీ చదవండి: భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’ -
షార్జా నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానం.. కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కరాచీ: షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది. 'షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం 6E-1406ను కరాచీ వైపు మళ్లించాం. సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించి పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తాం.' అని ఇండిగో ప్రకటనలో తెలిపింది. రెండు వారాల వ్యవధిలోనే భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ కావడం గమనార్హం. జులై5న న్యూఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం కూడా సాంకేతిక సమస్య వల్ల కరాచీలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కొన్ని గంటల పాటు అక్కడే ఉంది. -
దర్శకుడికి వార్నింగ్
కరాచీ: బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ కు పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. లాహోర్ వెళ్లేందుకు బుధవారం కరాచీ ఎయిర్ పోర్టుకు వచ్చిన 'బజరంగీ భాయిజాన్' దర్శకుడికి వ్యతిరేకంగా కొంతమంది ఆందోళన నిర్వహించారు. భారత్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయరని ఆందోళనకారులు నిలదీశారు. ఒక వ్యక్తి బూటు చేత్తో పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ కబీర్ ఖాన్ వెంట పడ్డాడు. పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా భారత్ కుట్రలు చేస్తోందని, దీన్ని సహించబోమంటూ పదేపదే హెచ్చరించాడు. కరాచీలో ఓ సదస్సులో పాల్గొనడానికి కబీర్ ఖాన్ పాకిస్థాన్ వచ్చారు. కబీర్ ఖాన్ తీసిన పాంటమ్' సినిమా పాకిస్థాన్ లో వివాదాస్పమైంది. ఈ సినిమా విడుదలపై లాహోర్ హైకోర్టు నిషేధం విధించింది. కరాచీ ఎయిర్ పోర్టులో కబీర్ ఖాన్ ను అడ్డుకోవడాన్ని మరో దర్శకుడు మధు భండార్కర్ ఖండించారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్
శంషాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంపై రెండు రోజులుగా జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్అలర్ట్ ప్రకటించారు. కేంద్రం ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కూడా అంతర్గత భద్రతను పెంచినట్లు విమానాశ్రయ భద్రతా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. -
కరాచీ విమానాశ్రయంపై మళ్లీ దాడి
-
కరాచీ విమానాశ్రయంపై మళ్లీ దాడి
ఆది, సోమవారాల్లో ఉగ్రవాద దాడితో కకావికలమైన కరాచీ ఎయిర్ పోర్ట్ మంగళవారం మళ్ళీ దాడికి గురైంది. అయిదు నుంచి పది మంది ఉగ్రవాదులు విమానాశ్రయంలోని ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఫోర్సు కార్యాలయంపై రెండు వైపుల నుంచి ఒకే సారి దాడి చేశారు. భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నారు. దీంతో మరొక్క సారి కరాచీ ఎయిర్ పోర్టు కదనరంగంగా మారింది. ఆదివారం రాత్రి ఉగ్రవాదులు సిబ్బంది వేషాలతో ఎయిర్ పోర్టులోకి చొరబడి చేసిన దాడిలో 36 మంది చనిపోయారు. మంగళవారం ఉదయం సహాయ సిబ్బంది కార్గో విభాగం కోల్డ్ స్టోరేజి నుంచి మరో ఏడు శవాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య పెరిగింది. చనిపోయిన వారిలో 10 మంది ఉగ్రవాదులు, మరో 10 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మిగతావారంతా మామూలు పౌరులే. అయితే కరాచీ విమానాశ్రయ సిబ్బంది సాయం లేకుండా ఈ దాడి జరగడం అసాధ్యమని భద్రతా దళాలు భావిస్తున్నాయి. -
'విమానాలన్నింటిని ధ్వంసం చేసేందుకే దాడి'
కరాచీ: ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేసిన అన్ని విమానాలను తాలిబాన్ మిలిటెంట్లు ధ్వంసం చేయాలనుకునే లక్ష్యంతోనే కరాచీ ఎయిర్ పోర్ట్ పై దాడులు చేశారని ఓ నివేదికను పాక్ అధికారులు సమర్పించారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిపై ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఓ ప్రాథమిక నివేదికను అధికారులు సమర్పించారు. రెండు మార్గాల్లో విమానాశ్రాయంలోకి జొరబడిన ఉగ్రావాదుల ప్రయత్నాన్ని భద్రతా దళాలు చాకచక్యంగా అడ్డుకున్న సంగతి తెలిసిందే. విమానాశ్రయ నెట్ వర్క్ ను ధ్వంసం చేయాలనే వ్యూహంతోనే ఉగ్రవాదులు కుట్ర పన్నారని నివేదికలో వెల్లడించారు. విమానాశ్రయంపై జరిగిన దాడిని ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది సాధారణ ప్రజలతోపాటు 10 మంది ఉగ్రవాదులు ఈ ఘటనలో చనిపోయారు. -
తాలిబాన్ల దాడిలో 28 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్ కరాచీ పట్టణంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబాన్లు చేసిన దాడిలో మొత్తం 28 మంది మృతి చెందారు. తరచూ బాంబుదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఏకంగా ఆ దేశ ఆర్థిక రాజధాని అయిన కరాచీలోని విమానాశ్రయంపైనే దాడికి తెగబడ్డారు. ఆదివారం రాత్రి నుంచి ఈ దాడి కొనసాగుతోంది. తొలుత ఉగ్రవాదులు ఎయిర్‌పోర్ట్‌లోని పాత టెర్మినల్ వద్ద హ్యాండ్ గ్రనేడ్ విసిరారు. విమానాశ్రయంలోని పాత టెర్మినల్ వద్ద గల ఫోకర్ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరిగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడిలో చనిపోయిన 28 మందిలో 14 మంది పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది ఉన్నారు. తీవ్రవాదుల ఏరివేత కోసం భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. విమానాశ్రయన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.