షాకింగ్‌ ఘటన: విమానం గాల్లో ఉండగానే కుప్పకూలిన మహిళ ఆ తర్వాత...

Woman Collapses Mid Flight Collapse Due To Heart Attack  - Sakshi

మనం రైళ్లలోనూ, బస్సుల్లోనూ వెళ్లినప్పుడూ ఎవరైనా అనారోగ్యంతోనో లేక అనుకోకుండా అపస్మారక స్థతిలోకి వెళ్లితే... బస్సు అయితే గనుక సమీపంలోని ఆస్పత్రి వద్ద ఆపడం చేస్తారు. అదే రైలు అయితే వెంటనే సమీపంలోనే రైల్వే ఆస్పత్రికి ఇన్‌ఫాం చేసి అంబులెన్స్‌లో తీసుకువెళ్తారు. మరీ విమానంలో అదీ కూడా గాల్లో ఎగురుతూ ఉండగా అంటే ఊహించడానికే భయంగా అనిపిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. 

న్యూఢిల్లీ నుంచి పాట్నా బయలు దేరుతున్న ఇండిగో విమానంలో 59 ఏళ్ల సుమన్‌ అగర్వాల్‌ అనే మహిళ అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో తన సీటులోనే కుప్పకూలిపోయింది. దీంతో విమానాన్ని వెంటనే అత్యవసర ల్యాండింగ్‌ చేయాలని పైలెట్లు నిర్ణయించుకున్నారు. కానీ ముందు ఆమెకు ప్రాథమిక చికిత్స అందిచాల్సి ఉంటుంది. దీంతో పైలెట్లు వెంటనే పాట్నా ఎయిర్‌ కంట్రోల్‌కి కూడా సమాచారం అందించారు.

ఇంతలో నలుగురు వైద్యులు, నర్సులు సదరు మహిళను రక్షించడానికి హుటాహుటినా ఆమె వద్దకు వచ్చారు. ఆమె రక్తపోటు రికార్డు కాకపోవడం, పల్స్‌ కూడా కనిపించపోవడంతో ఒకింత టెన్షన్‌ పడ్డారు వైద్యులు. ముందుగా పేషెంట్‌కి ఆక్సిజన్‌ అందించారు. తదనంతరం కాన్యూలా అనే పరికరాన్ని నోటి గుండా ఆహార గొట్టంలోకి పెట్టారు.

ఇది ఆస్పత్రిలోనే సాధ్యం కానీ విమానంలో ఈ పరికరాన్ని పెట్టడం అత్యంత సవాలుతో కూడిన పని అయినప్పటికీ ఆ పరికరాన్ని ఆమె శ్వాసనాళ్వ వద్దకు పెట్టి దానిగుండా  డెక్సోనా, డెరిఫిలిన్‌ల వంటి మందులను వేయడమే గాక తక్షణమే శక్తి వచ్చే గ్లూకోజ్‌ వాటర్‌ను కూడా ఇచ్చారు. దీంతో ఆమె స్ప్రుహలోకి వచ్చింది. ఆ తర్వాత విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ నిమిత్తం దాదాపు 7.45కు పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాల్సిన విమానాన్ని సుమారు 25 నిమిషాల ముందు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ చేశారు. తదనంతరం ఆమెను అంబులెన్స్‌లో పరాస్‌ హెచ్‌ఎంఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ భర్త ప్రమోద్‌ అగర్వాల్‌ ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. 

(చదవండి: ఈ రెస్టారెంట్‌ బిల్‌ చూస్తే....వాట్‌? అని నోరెళ్లబెడతారు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top