ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Indigo Plane Takes Emergency Landing In Samshabad Airport - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌ అయింది. హైదరాబాద్‌ నుంచి గోవాకు వెళుతున్న ఇండిగో విమానం మంగళవారం ఉదయం టేకాఫ్‌ అయిన 20 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్‌ వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పూనుకున్నారు.

విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో ఇండిగో విమానంలో 146 మంది ప్రయాణీకులున్నారని అధికారులు తెలిపారు. కాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివారం పలు ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇండిగో సిస్టమ్స్‌ అనూహ్యంగా డౌన్‌ కావడంతో గంటన్నర పాటు ఇండిగో విమానాల సేవలు నిలిచిపోయాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top