మంత్రి ఉత్తమ్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ | Minister Uttam Kumar Helicpoter Emergency Landing | Sakshi
Sakshi News home page

మంత్రి ఉత్తమ్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

May 21 2025 12:47 PM | Updated on May 21 2025 1:05 PM

Minister Uttam Kumar Helicpoter Emergency Landing

సాక్షి, సూర్యాపేట: తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రమాదం తప్పింది. ఉత్తమ్‌ హెలికాప్టర్‌ కోదాడలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్‌ అయినట్టు తెలిసింది.

వివరాల ప్రకారం.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. హుజూర్‌నగర్ మండలం మేళ్లచెరువులో హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా.. వాతావరణశాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అనంతరం, మంత్రి ఉత్తమ్ కుమార్‌.. కోదాడ నుంచి హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గంలో  వెళ్లిపోయారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement