విమానంలో వ్యక్తి మృతి.. అత్యవసర ల్యాండింగ్‌

After Indian Man Dies Flight Emergency Landed In UAE - Sakshi

అబుదాబి : విమానంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. దీంతో ఢిల్లీ నుంచి మిలాన్‌ వెళ్తున్న విమానం అత్యవసరంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ల్యాండ్‌ అయ్యింది. మృతుడు కైలాష్‌ చంద్ర షైనీ(52) రాజస్తాన్‌కు చెందిన వాడని ఖలీల్‌ టైమ్స్‌ వెల్లడించింది. అతడు తన కొడుకు హీరా లాల్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడని పేర్కొంది. ఈ విషయాన్ని ఇండియన్‌ ఎంబసీ ధ్రువీకరించింది.

కాగా ఈ విషయం గురించి ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్‌ రాజమురుగన్‌ మాట్లాడుతూ.. అలీటాలియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో కైలాష్‌ సోమవారం రాత్రి మరణించాడని పేర్కొన్నారు. ఈ కారణంగా విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యిందని, అతడి శవాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఇతిహాద్‌ విమానంలో బాడీని బుధవారం భారత్‌కు పంపిస్తామని వెల్లడించారు. ఇదొక దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top