ఫ్లై దుబాయి విమానం ప్రమాదానికి గురికాకుండా ఎంతోమంది ప్రయాణికులు కాపాడిన భారతీయ పైలెట్ స్మిత్ మచ్చర్‌కి అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ స్వయంగా వీడియో కాల్ కూడా చేసి మాట్లాడారు. ఈయన ధైర్యసాహసాలని మెచ్చుకున్న టాలీవుడ్ హీరో చిరంజీవి.. క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ స్మిత్ మచ్చర్ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి తన మనసు చలించిందని చిరు రాసుకొచ్చారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అమన్‌కి అన్యాయం.. వర్షిణి దెబ్బకు మైండ్ బ్లాక్)
'తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటివారి ప్రాణాలని కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. జై హనుమాన్' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇకపోతే సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానం సుమారు 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్ మచ్చార్‌తో కో-పైలట్ ఘర్షణకు దిగి తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో విమానం ప్రమాదం దిశగా తీవ్ర వేగంతో కిందికి దూసుకెళ్తుందని గమనించిన కెప్టెన్ మచ్చార్... అతి కష్టం మీద కాక్‌పిట్ తలుపు తెరవడంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం విమానం టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో సిబ్బంది సహా 182 మంది ప్రయాణికులు ఉన్నారు.
(ఇదీ చదవండి: ‘ఫ్లై దుబాయ్’ హీరోకు రూ.కోటి నజరానా..)
తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ Smit Machchhar గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2026


