breaking news
fly dubai flight
-
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కీలక పరిణామం.. ఇద్దరు పైలట్ల అరెస్ట్!
దుబాయ్: ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై జరిగిన దాడి ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి కుట్ర పన్నారనే అనుమానంతో మరో ఇద్దరు మాల్దీవుల పైలట్లను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మాల్దీవుల మీడియా వెల్లడించింది. వీరిద్దరూ గతంలో ఇజ్రాయెల్‌కు వెళ్లినట్లు సమాచారం.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న FZ1073 విమానంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ, భారతీయ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై గొడ్డలితో దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్ ప్రతిఘటించడంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.జరిగిన ఘటనపై ఓ ప్రయాణికుడి తాజా వాంగ్మూలం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నిందితుడి చేతులకు వేసిన బంధనాలను సిబ్బంది సడలించేందుకు ప్రయత్నించారని, ప్రయాణికులు వీడియోలు తీయకుండా అడ్డుకున్నారని అతడు ఆరోపించాడు. గాయపడిన భారతీయ కెప్టెన్‌కు ఓ గుర్తుతెలియని మాత్రను కూడా ఇవ్వడానికి ప్రయత్నించారని పేర్కొన్నాడు. విమానంలో మొత్తం పురుష సిబ్బందినే నియమించారన్న ఆరోపణలూ వెలువడ్డాయి.అయితే ఈ ఆరోపణలపై అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. తాజాగా అరెస్టయిన ఇద్దరు పైలట్లపై కూడా బహిరంగంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేసినట్లు సమాచారం లేదు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదీ చదవండి: లడఖ్‌పై చైనాకు భారత్ గట్టి కౌంటర్ -
ఫ్లై దుబాయ్ ఫ్లైట్ ను ఇజ్రాయెల్ కూల్చేసేదే..!
-
నేరాన్ని ఒప్పుకున్న కోపైలెట్... విమానాన్ని ఎలా కూల్చాలనుకున్నానంటే..
-
విమానాన్ని కూల్చడమే నా లక్ష్యం
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేసిన కో–పైలట్, ఒమన్ జాతీయుడైన హమామ్ అల్–హమామీ మనసులో పెద్ద కుట్రే ఉన్నట్లు స్పష్టమైంది. ఆ విమానాన్ని కూల్చడమే తన లక్ష్యమని విచారణలో అతను నేరాన్ని అంగీకరించినట్లు ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక తన కథనంలో పేర్కొంది. చావుకు భయపడలేదని అతను వ్యాఖ్యానించాడు. కోపైలట్‌ను యూఏఈ అధికారులు భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దాడి తర్వాత విమానం అత్యవసరంగా సౌదీ అరేబియాలో ల్యాండైన సంగతి తెలిసిందే. నిందితుడిని అక్కడే అదుపులోకి తీసుకొని యూఏఈకి తరలించారు. కో–పైలట్ హమామీ ఒమన్ దేశస్థుడైన తండ్రికి, సిరియా దేశస్థురాలైన తల్లికి జని్మంచాడు. చాలా ఏళ్లు దుబాయ్‌లో నివసించాడు. సిరియాలో అంతర్యుద్ధ జరుగుతున్న సమయంలో అక్కడ కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల ఆకర్శితుడైనట్లు తెలుస్తోంది. అతడి సోషల్ మీడియా ఖాతాలను దర్యాప్తు అధికారులు జల్లెడ పడుతున్నారు. అతడు తొలగించిన ‘ఎక్స్’ ఖాతాలోని 3,000కు పైగా పోస్టుల స్క్రీన్షాట్లు ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వాటిలోని అనేక పోస్టులు ఇస్లామిక్ భావజాలానికి సంబంధించినవే ఉన్నాయి. -
ఫ్లైదుబాయ్ విమానం ఘటనలో బయటపడ్డ సంచలన నిజాలు
-
ఫ్లైదుబాయ్ ఘటనలో సంచలనం
దుబాయ్: యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ నుంచి ఇజ్రాయెల్ నగరమైన టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో జరిగిన సంచలన ఘటనకు సంబంధించిన మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌కు చెందిన విమాన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై ఓమాన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్ హమ్మమీ గొడ్డలితో దాడి చేసిన ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడిని ధైర్యంగా అడ్డుకుని, నిందితుడిని బంధించిన ఇజ్రాయెల్ ప్రయాణికులు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. నిందితుడిని తాళ్లతో కట్టేసిన తర్వాత, కొందరు విమాన సిబ్బంది వచ్చి అతడిని విడిచిపెట్టమని డిమాండ్ చేశారని వారు పేర్కొన్నారు.విమానం గాల్లో ఉండగా కో-పైలట్ హమామ్ అల్-హమ్మమి విమానంలోని క్రాష్ యాక్స్ (గొడ్డలి) తీసుకుని భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో విమానం కేవలం 30 సెకన్లలోనే 14,000 అడుగులకు పైగా కిందికి దూసుకెళ్లడంతో పెను ప్రమాదం ముంచుకొచ్చింది. తీవ్ర గాయాలలైనప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అత్యంత సాహసంతో కాక్‌పిట్ డోర్ తెరిచారు.ఈ ప్రమాదాన్ని గమనించిన ఇజ్రాయెల్ ప్రయాణికులు త్వివికా మానేస్ , డేనియల్ లిచ్టర్, యానివ్ హయాన్, అసాఫ్ రాజువాన్ వెంటనే కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హెడ్‌ఫోన్ వైర్లు, జిప్ టైలతో నిందితుడి చేతులను వెనక్కి కట్టి, బోర్లా పడుకోబెట్టి బంధించారు.ప్రయాణికుల సంచలన ఆరోపణలు'ది న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రకారం.. నిందితుడిని కట్టేసిన కొద్దిసేపటికి కొందరు విమాన సిబ్బంది అక్కడికి వచ్చి అతడిని విడిచిపెట్టాలని కోరినట్లు ప్రయాణికులు తెలిపారు.కోపైలట్‌ను విడిచిపెట్టమని వారు మమ్మల్ని అడిగారు. అసలు వారెందుకు అలా అన్నారో మాకు అర్థం కాలేదు అని త్వివికా మానేస్ ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది ప్రవర్తనతో ప్రయాణికులలో అనుమానాలు తలెత్తాయని, అయితే ఏ సిబ్బంది కూడా ఈ దాడిలో ప్రత్యక్షంగా భాగస్వాములని తాము అనడం లేదని డేనియల్ లిచ్టర్ స్పష్టం చేశారు. ప్రయాణికులు మాత్రం అతడిని చంపాలని అనుకోలేదని, భవిష్యత్తులో విచారణ జరగడం కోసమే అతడిని సజీవంగా ఉంచాలని భావించామని తెలిపారు.ఇదీ చదవండి : ఫ్లైదుబాయ్ విమానంలో.. ఉడత సాయం కాదు.. అంతకు మించి సిబ్బంది పదేపదే తాము ఇన్చార్జ్ అని వాదిస్తూ, కాక్‌పిట్ చుట్టూ ఉన్న ప్రదేశం నుండి ప్రయాణికులను వెళ్ళిపోవాలని కోరడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ప్రయాణికులు సిబ్బందిని ఐదు, ఆరవ వరుస సీట్లకు పంపించి, కాక్‌పిట్ ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా మరో ప్రయాణికుడిని ఉంచారు. ఆ తర్వాత విమానంలో ఉన్న రిజర్వ్ పైలట్లు విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.ఉగ్రదాడిగా ప్రకటించిన యూఏఈఈ ఘటనను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అటార్నీ జనరల్ అధికారికంగా ఉగ్రవాద దాడిగా ప్రకటించారు. ఇది ముందస్తు కుట్రా? లేక దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. కో-పైలట్ రాడికల్ ఇస్లామిస్ట్ భావజాలం ఉందని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కనిపిస్తోందని అన్నారు. -
నా మనసు చలించింది.. పైలెట్ మచ్చర్ గురించి చిరు ట్వీట్
ఫ్లై దుబాయి విమానం ప్రమాదానికి గురికాకుండా ఎంతోమంది ప్రయాణికులు కాపాడిన భారతీయ పైలెట్ స్మిత్ మచ్చర్‌కి అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ స్వయంగా వీడియో కాల్ కూడా చేసి మాట్లాడారు. ఈయన ధైర్యసాహసాలని మెచ్చుకున్న టాలీవుడ్ హీరో చిరంజీవి.. క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ స్మిత్ మచ్చర్ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి తన మనసు చలించిందని చిరు రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అమన్‌కి అన్యాయం.. వర్షిణి దెబ్బకు మైండ్ బ్లాక్)'తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటివారి ప్రాణాలని కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. జై హనుమాన్' అని చిరంజీవి ట్వీట్ చేశారు.ఇకపోతే సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానం సుమారు 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్ మచ్చార్‌తో కో-పైలట్ ఘర్షణకు దిగి తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో విమానం ప్రమాదం దిశగా తీవ్ర వేగంతో కిందికి దూసుకెళ్తుందని గమనించిన కెప్టెన్ మచ్చార్... అతి కష్టం మీద కాక్‌పిట్ తలుపు తెరవడంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం విమానం టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో సిబ్బంది సహా 182 మంది ప్రయాణికులు ఉన్నారు.(ఇదీ చదవండి: ‘ఫ్లై దుబాయ్’ హీరోకు రూ.కోటి నజరానా..)తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ Smit Machchhar గారికి నా హృదయపూర్వక అభినందనలు.ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2026 -
ఆకాశంలో మృత్యుఘోష.. 174 మందిని కాపాడిన భారతీయుడు
-
180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ను ప్రశంసించిన మోదీ, ట్రంప్
-
రన్‌వేను ఢీకొని.. పేలిపోయి..
మాస్కో: దక్షిణ రష్యాలోని రోస్తోవ్ ఆన్ డోన్ నగరంలో శనివారం తెల్లవారుజామున ‘ఫ్లై దుబాయ్’ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానంలోని మొత్తం 62 మందీ మృతిచెందారు. వీరిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణం, రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ‘ఫ్లై దుబాయ్ బోయింగ్ 737’ విమానం భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.50కి దుబాయ్ నుంచి బయలుదేరింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రోస్తోవ్ ఆన్ డోన్ నగరంలో దిగాల్సి ఉంది. అయితే.. ప్రతికూల వాతావరణం వల్ల ఓసారి విఫలయత్నం చేసింది. రెండుగంటలపాటు చక్కర్లు కొట్టింది. 6.20 గంటలకు రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ రన్‌వేను ఢీకొని పేలిపోయింది. ‘రన్‌వేపై దిగే ప్రయత్నంలో విమానం పెద్ద మంటతో కాలిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి విమానం రన్‌వేను ఢీకొని ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. రన్‌వేను ఢీకొన్న వెంటనే విమానం పేలిపోయిందన్నారు. పెను గాలుల ధాటికి విమాన శకలాలు ఘటన జరిగిన ప్రాంతం నుంచి కిలోమీటరున్నర దూరం వరకు కొట్టుకుపోయాయి. విమానంలోని 62 మంది ప్రయాణికులు మృతిచెందారని ఎమిరేట్స్ కేంద్రంగా నడుస్తున్న ‘ఫ్లై దుబాయ్’ సంస్థ ఫేస్బుక్లో పోస్టు చేసింది. ఘటన జరిగిన వెంటనే ఎయిర్‌పోర్టులోకి ఇతర విమానాల రాకపోకలను దగ్గర్లోని క్రాస్నోదర్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. 500 మంది సిబ్బంది, 60 వాహనాలు రంగంలోకిదిగి గంటలోపే మంటలను అదుపుచేశాయి. రెండు బ్లాక్ బాక్స్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సాంకేతిక, భద్రత లోపాల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో భారతీయ దంపతులు రష్యా విమాన ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు భారతీయులు మోహన్ శ్యామ్, అంజు కత్రివేల్ కేరళకు చెందిన వారుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ‘రష్యాలోని ఆయుర్వేదిక్ రిసార్టులో పనిచేసే ఈ దంపతులు.. కేరళలోని వెంగోలాకు బంధువులతో గడిపేందుకు రెండు నెలలు సెలవుపై వచ్చారు. శుక్రవారమే వీరు బంధువులకు వీడ్కోలు చెప్పి ఎమిరేట్స్ మీదుగా రష్యాకు బయలుదేరారు. అంతలోనే ప్రమాదం జరిగిపోయింది’ అని కేరళ హోం మంత్రి రమేశ్ చెన్నితల తెలిపారు. ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఇద్దరు భారతీయులతోపాటు 44 మంది రష్యన్లు, 8 మంది ఉక్రెయిన్ దేశస్తులు, ఒక ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వ్యక్తి ఉన్నారు. మిగిలిన ఏడుగురు విమాన సిబ్బంది. We're aware of reports coming out of Russia and our team is currently gathering more details. — Boeing Airplanes (@BoeingAirplanes) March 19, 2016 -
కూలిన విమానంలో ఇద్దరు భారతీయులు!
రష్యాలోని రొస్తోవ్ ఆన్ డాన్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయులు కూడా మరణించారు. ఈ విషయాన్ని దుబాయ్ వార్తా సంస్థ తన ట్వీట్లో ప్రకటించింది. మృతుల్లో 44 మంది రష్యన్లు, 8 మంది ఉక్రెనియన్లు, ఇద్దరు భారతీయులు, ఒకరు ఉజ్బెకిస్థాన్‌కు చెందినవారు ఉన్నట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకటించింది. మృతుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరఫున మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ఫ్లై దుబాయ్ సంస్థ 2009 నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటివరకు తమ విమానం ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారని చెబుతోంది. రన్‌వేకు సుమారు 800 అడుగుల ఎత్తులో ఉండగా విమానం కూలిపోయిందని స్థానిక పాత్రికేయులను ఉటంకిస్తూ రొస్తోవ్ ప్రాంత గవర్నర్ వాసిలీ గోలుబెవ్ తెలిపారు. హరికేన్ స్థాయిలో తీవ్రమైన గాలులు రావడంతో విమానం కూలిపోయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.


