ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కీలక పరిణామం.. ఇద్దరు పైలట్ల అరెస్ట్! | Flydubai Case Takes New Turn another two pilots Arrested | Sakshi
Sakshi News home page

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కీలక పరిణామం.. ఇద్దరు పైలట్ల అరెస్ట్!

Oct 13 2026 8:24 PM | Updated on Oct 13 2026 8:28 PM

Flydubai Case Takes New Turn another two pilots Arrested

దుబాయ్: ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై జరిగిన దాడి ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి కుట్ర పన్నారనే అనుమానంతో మరో ఇద్దరు మాల్దీవుల పైలట్లను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మాల్దీవుల మీడియా వెల్లడించింది. వీరిద్దరూ గతంలో ఇజ్రాయెల్‌కు వెళ్లినట్లు సమాచారం.

సెప్టెంబర్ 30న దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌ వెళ్తున్న FZ1073 విమానంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ, భారతీయ కెప్టెన్ స్మిట్‌ మచ్చార్‌పై గొడ్డలితో దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్ ప్రతిఘటించడంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

జరిగిన ఘటనపై ఓ ప్రయాణికుడి తాజా వాంగ్మూలం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నిందితుడి చేతులకు వేసిన బంధనాలను సిబ్బంది సడలించేందుకు ప్రయత్నించారని, ప్రయాణికులు వీడియోలు తీయకుండా అడ్డుకున్నారని అతడు ఆరోపించాడు. గాయపడిన భారతీయ కెప్టెన్‌కు ఓ గుర్తుతెలియని మాత్రను కూడా ఇవ్వడానికి ప్రయత్నించారని పేర్కొన్నాడు. విమానంలో మొత్తం పురుష సిబ్బందినే నియమించారన్న ఆరోపణలూ వెలువడ్డాయి.

అయితే ఈ ఆరోపణలపై అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. తాజాగా అరెస్టయిన ఇద్దరు పైలట్లపై కూడా బహిరంగంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేసినట్లు సమాచారం లేదు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదీ చదవండి: లడఖ్‌పై చైనాకు భారత్ గట్టి కౌంటర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement