లడఖ్‌పై చైనాకు భారత్ గట్టి కౌంటర్‌ | India vs China: Ladakh integral part of India, Chinese denial cannot change fact | Sakshi
Sakshi News home page

లడఖ్‌పై చైనాకు భారత్ గట్టి కౌంటర్‌

Oct 13 2026 6:31 PM | Updated on Oct 13 2026 6:45 PM

India vs China: Ladakh integral part of India, Chinese denial cannot change fact

సాక్షి,న్యూఢిల్లీ: లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది. లడఖ్‌లోని 28 ప్రాంతాలు, భౌగోళిక అంశాలకు అధికారిక పేర్లు గుర్తించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయగా.. దానిపై భారత్ దీటుగా స్పందించింది.

లడఖ్ భారత్‌లో విడదీయలేని భాగమని, చైనా ఎంతగా నిరాకరించినా ఈ వాస్తవం మారదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ చేసిన ప్రకటన కూడా స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

లడఖ్‌లోని 28 ప్రాంతాలు, భౌగోళిక అంశాలను స్థానిక భాగస్వాములతో సంప్రదింపుల అనంతరం సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లో ప్రామాణిక పేర్లతో గుర్తించినట్లు కేంద్ర హోం శాఖ అక్టోబర్ 2న ప్రకటించింది. ఈ చర్యపై చైనా అభ్యంతరాల నేపథ్యంలో భారత్ తన వైఖరిని ఈ విధంగా తెలిపింది.

ఇదీ చదవండి: హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 46 కేజీల కుళ్లిన ఆహారం సీజ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement