AP: హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 46 కేజీల కుళ్లిన ఆహారం సీజ్! | Food Safety Raids In Visakhapatnam Hotels, Food Safety Officials Find Rotten Food At Kailash Parbat Restaurant | Sakshi
Sakshi News home page

AP: హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 46 కేజీల కుళ్లిన ఆహారం సీజ్!

Oct 13 2026 4:38 PM | Updated on Oct 13 2026 5:10 PM

Food safety officials raid hotels in Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో పలు రెస్టారెంట్‌లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కైలాష్ పర్బత్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులు, సుమారు 46 కేజీల కుళ్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. కస్టమర్ల ఆరోగ్యంతో  చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 


అందులో పాడైపోయిన చికెన్‌ బిర్యానీ, వెజ్ మంచూరియా, సమోసాలతో పాటు పలు ఆహార పదార్థాల నమూనాలను వారు సేకరించారు. అంతేకాదు హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. రెస్టారెంట్‌లోని కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. నాసిరకం, కాలం చెల్లిన పలు ఆహార పదార్థాలను సీజ్ చేశారు. నిల్వ ఉన్న ఆహారాన్నే వేడిచేసి వినియోగదారులకు సర్వ్‌ చేస్తున్నట్టు అధికారుల తనిఖీలో గుర్తించారు. విశాఖలో నిబంధనలు పాటించని పలు హోటళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. హోటళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి: 4 రోజులపాటు ఏపీకి వర్ష సూచన
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement