కూలిన విమానంలో ఇద్దరు భారతీయులు!
రష్యాలోని రొస్తోవ్ ఆన్ డాన్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయులు కూడా మరణించారు.
రష్యాలోని రొస్తోవ్ ఆన్ డాన్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయులు కూడా మరణించారు. ఈ విషయాన్ని దుబాయ్ వార్తా సంస్థ తన ట్వీట్‌లో ప్రకటించింది. మృతుల్లో 44 మంది రష్యన్లు, 8 మంది ఉక్రెనియన్లు, ఇద్దరు భారతీయులు, ఒకరు ఉజ్బెకిస్థాన్‌కు చెందినవారు ఉన్నట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకటించింది. మృతుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరఫున మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ఫ్లై దుబాయ్ సంస్థ 2009 నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటివరకు తమ విమానం ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారని చెబుతోంది. రన్‌వేకు సుమారు 800 అడుగుల ఎత్తులో ఉండగా విమానం కూలిపోయిందని స్థానిక పాత్రికేయులను ఉటంకిస్తూ రొస్తోవ్ ప్రాంత గవర్నర్ వాసిలీ గోలుబెవ్ తెలిపారు. హరికేన్ స్థాయిలో తీవ్రమైన గాలులు రావడంతో విమానం కూలిపోయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.


