న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు రియాద్, దమ్మామ్ వెళ్లే విమానాలను నవంబర్ 7 వరకు, జెడ్డా విమానాలను అక్టోబర్ 31 వరకు రద్దు చేసినట్లు ప్రకటించాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం అక్టోబర్ 24 లోపు బుక్ చేసుకున్న టికెట్లకు ఉచితంగా తేదీ మార్చుకునే అవకాశం లేదా పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు తెలిపాయి.
అలాగే ఇండిగో సంస్థ జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు నడిచే విమానాలను అక్టోబర్ 31 వరకు రద్దు చేయగా, ఆకాశ్ ఎయిర్ జెడ్డాకు నవంబర్ 10 వరకు, రియాద్‌కు నవంబర్ 30 వరకు సర్వీసులను నిలిపివేసింది. ఈ విమాన సర్వీసుల రద్దు వల్ల ముఖ్యంగా ఉమ్రా యాత్రికులు, ఇబ్బంది పడుతున్న భారతీయ పౌరుల కోసం జెడ్డాలోని భారత కాన్సులేట్ 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. స్థానిక స్వచ్ఛంద సంస్థల సహాయంతో బాధితులకు ఆహారం, మందులు అందజేస్తూ, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై తగిన మార్గదర్శకాలను తెలియజేసింది.
ఇదీ చదవండి: పర్వతాల్లో చిక్కుకున్న పారాగ్లైడర్లు.. రెస్క్యూ ఆపరేషన్ షురూ!


