ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్‌లోని పారాగ్లైడ్రింగ్ కేంద్రమైన బీర్-బిల్లింగ్ ప్రాంతంలో ఆస్ట్రియాకు చెందిన సెబాస్టియన్, పోలాండ్‌కు చెందిన ఆదం విస్జ్‌పిగా అనే ఇద్దరు విదేశీ పారాగ్లైడర్లు ధౌలాధర్ పర్వత శ్రేణుల్లో చిక్కుకుపోయారు. వీరు టేకాఫ్ తీసుకున్నప్పటికీ నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశానికి తిరిగి చేరుకోలేకపోయారు. సెబాస్టియన్ కరేరి సరస్సు సమీపంలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా, మరో పైలట్ ఆదం ఆచూకీ కోసం ఆర్మీ హెలికాప్టర్లు, స్థానిక గ్రౌండ్ రెస్క్యూ టీమ్‌లు, పారాగ్లైడర్స్ అసోసియేషన్ వాలంటీర్లు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, అక్కడ నెలకొన్న తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణం, మంచు కొండల కఠినమైన భూభాగం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ ప్రాంతంలో గతంలోనూ అనేక మంది పైలట్లు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయినందున, విదేశీ పారాగ్లైడర్లు వాతావరణ హెచ్చరికలను, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: మస్క్ వార్నింగ్: ఇజ్రాయెల్ ఫ్రంట్‌లైన్ కుప్పకూలుతుంది!


