breaking news
himachalpradesh
-
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న విష్ణుప్రియ (ఫోటోలు
-
వీర పోరాటాల గడ్డ తెలంగాణ
సాక్షి, సప్తగిరికాలనీ(కరీంనగర్): ‘తెలంగాణ చరిత్ర ఐదు వేల సంవత్సరాలది. నాలుగు వేల సంవత్సరాల కింద ఇనుప పనిముట్లు, కత్తులు తదితర వస్తువుల తయారీ ఇక్కడే జరిగింది.. పురావస్తు శాఖ తవ్వకాల్లో మనకు ఆధారాలు దొరికాయి.. ఎందరో త్యాగాల ఫలితం.. వీర పోరాటాల గడ్డే మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం..’ అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో మూడు రోజులుగా కరీంనగర్లో నిర్వహిస్తున్న తెలంగాణ వైభవం కార్యక్రమం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆయన హాజరై ప్రసంగించారు. సంసృతి లేకపోతే మనం లేమని, విలువలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో పిల్లలు, యువతరానికి నిజమైన తెలంగాణ గొప్పతనం తెలియ చేయడం చాలా మెచ్చుకోదగ్గ విషయమని, రాబోయే రోజుల్లో ప్రాచీన తెలంగాణ వైభవాన్ని అన్ని జిల్లాల్లో ఇటువంటి సదస్సులు, సమావేశాల ద్వారా విసృతం చేయాలని తెలిపారు. అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే చరిత్రను మరువద్దుని సూచించారు. సర్ధార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రజాకార్ల రాక్షసత్వాన్ని అణచివేసి మనకు నిజమైన స్వాతంత్య్రాన్ని 1948 సెప్టెంబర్ 17న తెచ్చిపెట్టారని గుర్తు చేశారు. పటేల్‌కు తెలంగాణ ఎప్పుడూ రుణపడే ఉంటుందన్నారు. తెలంగాణ వైభవాన్ని అందరికీ తెలిసేలా చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ కొందరు తెలంగాణ చరిత్రను తిరగేస్తున్నారని, వారి చరిత్రే రాబోయే తరాల కు అందించాలని వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమాలు చేస్తుంటే అవి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. బతుకమ్మ అంటే మనకు గౌరమ్మ అని, గౌరమ్మను దేవతగా పూజిస్తుంటే ఆ బతుకమ్మను డిస్కో ఆటగా మారుస్తున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పటేల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నాడు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పటేల్ ఫొటో పెట్టుకొని దేని కోసం ఉద్యమాలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక సెప్టెంబర్ 17న గొప్పగా చేసుకొందామన్న వారు ఇప్పుడు మరువడం విడ్డూరమన్నారు. పటేల్, కుమురంభీం, చాకలి అయిలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వాళ్లను మరిచి నేడు నిజాం సమాధి వద్ద మోకారిళ్లుతున్నారని విమర్శించారు. ప్రజ్ఞాభారతి రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ఎల్.రాజభాస్కర్ రెడ్డి, డి.నిరంజనాచారి మాట్లాడుతూ మూడు రోజుల్లో 2600 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలంగాణ వైభవాన్ని చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర, జిల్లా బాధ్యులు బూర్ల దక్షిణమూర్తి, రాజేందర్ చడ్డా, దత్తాత్రేయ శాస్త్రీ, గిరిధర్, రఘు, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, మురళీ మనోహరచారి, విద్యాసంస్థల భాద్యులు అనంతరెడ్డి, రమణారావు, శ్రీనివాస్‌రావు, రాజేశ్, వేద సం హిత, సత్యగిరి, విజయభారతి పాల్గొన్నారు. ప్రదర్శనలను తిలకించిన గవర్నర్.. తెలంగాణ వైభవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆదివారం రాత్రి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ బండి సంజయ్‌కుమార్ తిలకించారు. పురాతన కాలం నాటి నాణేలు, తెలంగాణ సంసృతిని చూపెట్టిన సమ్మక్క సారలమ్మ, ఎలగందుల ఖిల్ల, గోల్కొండ ఫోర్టు, బతుకమ్మ తదితర ప్రదర్శనలను తిలకించారు. అనంతరం పలువురు విద్యాసంస్థలకు బాధ్యులకు గవర్నర్ జ్ఞాపికలను బహూకరించారు. కాగా గవర్నర్‌ను ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి బాధ్యులు ఘనంగా సన్మానించారు. -
భారీ వర్షాలకు నదిలో చిక్కుకున్న కారు
-
హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో గురువారం స్వల్ప భూకంపం సంభవించింది. జమ్ము కాశ్మీర్ సరిహద్ధులోని చంబా ప్రాంతంలో తెల్లవారుజామున 01.39 గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన సమాచారం తమకు అందలేదని భూకంప కేంద్ర డైరెక్టర్ మన్మోహన్సింగ్ తెలిపారు. చంబా ప్రాంతంలో భూకంపం సంభవించడం ఈ నెలలో ఇది రెండో సారి. -
హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం
కులు: హిమాచల్ ప్రదేశ్ లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కులులో ఉదయం 4.12నిమిషాల ప్రాంతంలో 3.3 తీవ్రతతో భూమి కంపించినట్లు వాతావరణ, భూభౌతిక సంస్ధ వెల్లడించింది. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. తక్కువ తీవ్రత వల్లే ఎలాంటి నష్టం సంభవించలేదని పేర్కొంది. కొద్ది రోజుల క్రితం నేపాల్ లో కూడా భూమి కంపించిన విషయం తెలిసిందే. -
వరదలో కొట్టుకుపోయిన కుటుంబం
సిమ్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు కొట్టుకుపోయారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకు సమీపంలోని గవల్ది గ్రామంలో చోటుచేసుకుంది. నేపాలీ కుటుంబంలో 12 ఏళ్ల దివ్యాంగ బాలుడు మాత్రం యాదృచ్చికంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భారీ వరదలకు ఇంటితో సహా కుటుంబంలోని సభ్యులంతా కొట్టుకుపోయారని, స్థానికుల సహకారంతో మృతదేహాలను వెలికితీసినట్టు సిమ్లా పోలీసు కమిషనర్ తెలిపారు. -
విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు క్షేమం
ఆదిలాబాద్ : విహార యాత్రకు వెళ్లిన తమ పిల్లల ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ఓ ప్రయివేట్ స్కూలుకు చెందిన 52మంది విద్యార్థులు ఈనెల 6వ తేదీన విహార యాత్రకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. కాగా గత రాత్రి విద్యార్థులు ఎక్కాల్సిన ట్రయిన్ మిస్ కావడంతో వారి ఆచూకీ కొద్దిసేపు తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లల ఆచూకీ తెలిపాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఎట్టకేలకు తాము క్షేమం అంటూ విద్యార్థుల నుంచి ఫోన్ కాల్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.