విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు క్షేమం | Mancherial students safe in himachal pradesh | Sakshi
Sakshi News home page

విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు క్షేమం

Jan 12 2016 10:49 AM | Updated on Oct 9 2018 5:27 PM

విహార యాత్రకు వెళ్లిన తమ పిల్లల ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ఓ ప్రయివేట్ స్కూలుకు చెందిన

ఆదిలాబాద్ : విహార యాత్రకు వెళ్లిన తమ పిల్లల ఆచూకీ  లభ్యం కావడంతో  తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.  వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ఓ ప్రయివేట్ స్కూలుకు చెందిన 52మంది విద్యార్థులు ఈనెల 6వ తేదీన విహార యాత్రకు హిమాచల్ ప్రదేశ్  వెళ్లారు. కాగా గత రాత్రి  విద్యార్థులు ఎక్కాల్సిన ట్రయిన్ మిస్ కావడంతో వారి ఆచూకీ కొద్దిసేపు తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లల ఆచూకీ తెలిపాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఎట్టకేలకు తాము క్షేమం అంటూ విద్యార్థుల నుంచి ఫోన్ కాల్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement