విదేశీ కొలువులకు భరోసా | Revanth Reddy Launches Foreign Employment Scheme | Sakshi
Sakshi News home page

విదేశీ కొలువులకు భరోసా

Nov 28 2026 6:09 AM | Updated on Nov 28 2026 6:09 AM

Revanth Reddy Launches Foreign Employment Scheme

కొత్తగా సీఎం ఓవర్సీస్‌ ఎంప్లాయ్‌మెంట్‌ స్కీమ్‌ ద్వారా ఈ ఏడాది 7 వేల మంది యువతకు లబ్ధి  

భాషా శిక్షణ, వీసా, విమాన ప్రయాణ ఖర్చులకు 50 శాతం సబ్సిడీ 

మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం కేటాయింపు 

ఉత్తర్వులు జారీ చేసిన శక్తి కార్యదర్శి దాసరి హరిచందన

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లో ఉద్యోగాలు సాధించాలనుకునే నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత అందించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. సరికొత్తగా ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను శక్తి విభాగకార్యదర్శి దాసరి హరిచందన జారీ చేశారు. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈ పథకం వర్తిస్తుంది. 

నైపుణ్యం కలిగిన కార్మికులు, వృత్తివిద్య పూర్తి చేసిన వారికి వివిధ రంగాల్లో విదేశాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. అయితే విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ ఖర్చు కావడంతో పేద కుటుంబాలకు చెందిన యువత ఈ అవకాశాలను అందుకోలేకపోతున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.  

తొలి ఏడాది 7 వేల మందికి సాయం  
2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మందికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేరుగా విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే 5,880 మందికి, విదేశీ భాషల్లో ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లే 1,120 మందికి ఆర్థిక సాయం అందిస్తుంది. అభ్యర్థుల ఆసక్తి, విద్యార్హతలు, వృత్తి నైపుణ్యాలు, విదేశాల్లో ఉద్యోగావకాశాలను బట్టి కేటగిరీలను నిర్ధారిస్తారు. విదేశీ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులను రెండు కేటగిరీలుగా విభజించారు.  

⇒  విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ, పరీక్షలు అవసరం లేకుండా నేరుగా ఉద్యోగాలకు వెళ్లే వారిని మొదటి కేటగిరీలో చేర్చారు. వీరికి వీసా, విమాన ప్రయాణ ఖర్చుల నిమిత్తం గరిష్టంగా రూ.లక్ష వరకు వ్య యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 50 శాతం అంటే రూ.50 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. 

⇒   ఆయా దేశాల భాషల్లో ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లే వారిని రెండో కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలో గరిష్టంగా రూ.3.50 లక్షల వరకు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 50%.. అంటే రూ.1.75 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. రెండు కేటగిరీల్లోనూ మిగతా 50%  ఖర్చును అభ్యర్థులు భరించాలి. సొంతంగా డబ్బు సమకూర్చుకోలేని వారికి బ్యాంకుల ద్వారా రుణాలందించే ఏర్పాట్లు చేస్తారు. ఇందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు టామ్‌కామ్‌ జాతీయ బ్యాంకులతో సమన్వయం చేసుకుంటుంది.

ఏయే రంగాల్లోని వారికి అవకాశం అంటే ..
⇒   నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమలు, ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్, రవాణా, లాజిస్టిక్స్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, వైద్య సహాయక సేవలు, హోటళ్లు, పర్యాటకం, మరమ్మతులు, నిర్వహణ, గృహ, వ్యక్తిగత సేవల రంగాల్లో ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది.  
⇒ విదేశీ ఉద్యోగ సంస్థలతో భాగస్వామ్యాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రభుత్వాల మధ్య కారి్మక ఉపాధి ఒప్పందాల ద్వారా ఉద్యోగావకాశాలను విస్తరించనున్నారు.  

⇒  అభ్యర్థుల వయసు 18–40 ఏళ్ల మధ్య ఉండాలి.  
⇒  రేషన్‌ కార్డు ఆధారంగా ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.  
⇒  మొత్తం లబి్ధదారుల్లో మహిళలకు కనీసం 33.33 శాతం, దివ్యాంగులకు కనీసం 5 శాతం కేటాయిస్తారు.  

⇒ తగినంతమంది అర్హులు లేకపోతే రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదంతో మిగిలిన అవకాశాలను ఇతర అర్హులకు కేటాయిస్తారు.  
⇒ త్వరలో లాంచ్‌ చేయనున్నటామ్‌కామ్‌ ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  
⇒  గడువు ముగిసిన లేదా రిజి్రస్టేషన్‌ పూర్తయిన 30 రోజుల్లో లబి్ధదారుల ఎంపిక పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement