ఆచితూచి | Telangana Speeds Up Land Re-Survey Across 2721 Villages | Sakshi
Sakshi News home page

ఆచితూచి

Nov 28 2026 5:51 AM | Updated on Nov 28 2026 5:51 AM

Telangana Speeds Up Land Re-Survey Across 2721 Villages

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంటలో రైతుల సమక్షాన సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది

రాష్ట్రవ్యాప్తంగా 2,721 గ్రామాల్లో భూముల రీసర్వే 

రైతుల సమక్షాన వారు చెప్పిన సరిహద్దులతోనే కొలతలు 

పలు గ్రామాల్లో రికార్డులు, క్షేత్రస్థాయి భూముల్లో తేడా 

చిన్నచిన్న సమస్యలు స్థానికంగా పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి 

సమస్యల పరిష్కారంపై స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భూసంబంధ వివాదాలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టింది. అయితే, ఈ సర్వేతో సమస్యలు రాకుండా పారదర్శకంగా, పకడ్బందీగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ముందస్తుగా రైతులకు సమాచారం అందించి, వారే సరిహద్దులను చూపించాక అత్యాధునిక రోవర్‌తో సర్వే చేస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నక్షా లేని గ్రామాలతోపాటు మరో ఐదు గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. ఆపై రాష్ట్రంలోని హైదరాబాద్‌ మినహా 32 జిల్లాలో 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి సర్వే ప్రారంభించారు.

రైతుల భూముల్లో హెచ్చుతగ్గులు రాకుండా హద్దులను కచ్చితత్వంతో నిర్ణయించేందుకు రోవర్‌ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ తీసుకొచ్చింది. రైతులకు ముందస్తుగానే సర్వే నోటీసులు అందజేసి, క్షేత్రస్థాయి కొలతలకు పహణీ, పాస్‌బుక్‌ల వివరాలతో సరిపోలుస్తున్నారు. అయితే పలు గ్రామాల్లో రికార్డుల్లో ఉన్న భూమి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా వస్తుండడంతో రైతుల అభ్యంతరాలను వీలైనంత వరకు గ్రామస్థాయిలోనే అదికారులు పరిష్కరిస్తున్నారు. 

సర్వే సాగుతోందిలా.. 
⇒  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 222 గ్రామాల్లో సర్వే సాగుతోంది. ఇప్పటికే 60 గ్రామాల్లో సర్వే పూర్తవగా, 34 గ్రామాల్లో క్లియరెన్స్‌ ఇచ్చారు. 100 గ్రామాల్లో ఇంకా ప్రారంభించలేదు. 50 గ్రామాల్లో సరిహద్దులు, ప్రభుత్వ భూములను లెక్కిస్తున్నారు. 30,391 మంది రైతులకు ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చారు.  

⇒  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 72 మండలాలకు గాను 1,750 గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 301 గ్రామాలను ఎంపిక చేయగా, 48 గ్రామాల్లో సర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో 16,500 మంది రైతులకు నోటీసులు ఇవ్వగా, 2వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి.  

⇒  ఉమ్మడి నిజామాబాద్‌లో149 గ్రామాలు రీసర్వేకు ఎంపిక చేస్తే, గ్రామాల్లో పూర్తయింది. 43,207 ఎకరాలకు క్లియరెన్స్‌ ఇ చ్చారు.సర్వే పూర్తయిన గ్రామాల్లో 4,500 మందికి నోటీసులు ఇస్తే, 80 అ భ్యంతరాలు రాగా> 10 పరిష్కరించారు.  

⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 225 గ్రామాలు సర్వేకు ఎంపికయ్యాయి. ఇప్పటి వరకు 80 గ్రామాల్లో సర్వే పూర్తవగా 51,204.32 ఎకరాలకు క్లియరెన్స్‌ వచ్చింది. ఇంకా 109 గ్రామాల్లో సర్వే మొదలు పెట్టలేదు.çసూర్యాపేట జిల్లాలో 142 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. ఐదుగురు రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. 
⇒  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 280 గ్రామాలు రీ సర్వేకు ఎంపికయ్యాయి. ఇందులో 51 గ్రామాల్లో సర్వే పూర్తయింది. 99 గ్రామాల్లో సర్వే జరుగుతోంది. 98 గ్రామాల్లో సర్వే ప్రారంభం కాలేదు.  

⇒  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 416 గ్రామాలు సర్వేకు ఎంపికయ్యాయి. ఇందులో 94 గ్రామాల్లో 89 వేల ఎకరాల్లో సర్వే పూర్తయింది. మరో 212 గ్రామాల్లో సర్వే సాగుతోంది.  
⇒  సిద్దిపేట జిల్లాలో 91 గ్రామాలు సర్వేకు ఎంపికయ్యాయి. 43 గ్రామాల్లో సర్వే పూర్తయింది. 43 గ్రామాల్లో ఇంకా సర్వే ప్రారంభం కాలేదు. సర్వే పూర్తయిన గ్రామాల్లో 2వేల మందికి పైగా రైతులకు నోటీసులు అందించారు. నంగునూరు మండలం మురదాబాద్‌ గ్రామంలో 45 అభ్యంతరాలు వచ్చాయి.  

⇒  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 245 గ్రామాలు సర్వేకు ఎంపికయ్యాయి. ఇందులో 47 గ్రామాల్లో సర్వే పూర్తయింది. 460 ఎకరాలకు క్లియరెన్స్‌ వచ్చింది. 188 గ్రామాల్లో సర్వే ప్రారంభం కాలేదు. సర్వే పూర్తయిన గ్రామాల్లో 1,999 నోటీసులు అందజేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సర్వే నత్తనడకన సాగుతోంది. 

రికార్డుల్లో కన్నా ఎక్కువగా.. 
పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లిలో సర్వే పూర్తయింది. ఇక్కడ నక్షా ప్రకారం 699.02 ఎకరాల భూమికిగాను, క్షేత్రస్థాయిలో 708 ఎకరాలు తేలింది. ఇక తాళ్లపెంట రెవెన్యూ పరిధిలో తాళ్లపెంట, బ్రహ్మళ్లకుంట, కర్రాలపాడుకు చెందిన భూములతో పాటు గంగదేవిపాడులోని కొన్ని భూములున్నాయి. ఇక్కడ నక్షాప్రకారం 8,413.02 ఎకరాలకుగాను క్షేత్ర స్థాయిలో 120 ఎకరాలు ఎక్కువగా వచ్చింది. కొందరి భూముల్లో కుంట, రెండు కుంటలే తేడా వస్తుండడంతో రైతులే పరిష్కరించుకుంటున్నారు. ఒకరిద్దరు అధికారుల దృష్టికి తీసుకురాగా, రైతులు చూ  పించిన హద్దుల ప్రకారం మరోసారి సర్వేకు సిద్ధంగా ఉన్నామని తహసీల్దార్‌ తెలిపారు.

భూమి తక్కువగా ఉందని అప్పీల్‌ 
20 ఏళ్ల క్రితం 2–21 ఎకరాల భూమి కొనుగోలు చేశాం. పాత పాస్‌ పుస్తకంతోపాటు తెలంగాణ ఏర్పడ్డాక కొత్త పాస్‌ పుస్తకం పొందా. రీసర్వేలో 2–13 ఎకరాలే ఉన్నట్టు నోటీసు ఇచ్చారు. 8 గుంటలు తక్కువ రావడంతో తహసీల్దార్‌కు అప్పీల్‌ చేశా.      – పనస పద్మ, నర్సింగాపురం, కొడకండ్ల మండలం, జనగామ జిల్లా

రీ సర్వేలో భూమి సరిపడా ఉంది 
అధికారులు చెప్పడంతో నేను, నా పొలం చుట్టపక్కల రైతులం వెళ్లాం. నాతో పాటు పలువురి భూమి కొలవగా నాకు ఉండాల్సి భూమి సరిగ్గానే ఉంది. మిగతా వారి వివరాలు కూడా సరిపోయాయి. రీసర్వేతో భవిష్యత్‌లోనూ భూములకు ఎలాంటి సమస్యలు రావని భావిస్తున్నా.     – పర్స సుబ్బయ్య, తాళ్లపెంట, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా

సర్వేలో సమస్యలు లేవు.. 
పాస్‌ పుస్తకం ప్రకారం నాకు ఉన్న రెండెకరాల భూమిని అదనపు కలెక్టర్‌ సమక్షంలో సర్వే చేశారు. పాస్‌పుస్తకం ప్రకారం భూమిని స ర్వే చేసి హద్దులు చూపించారు. ఎ లాంటి సమస్య రాలేదు. మా గ్రా మంలో ఏ రైతుకు కూడా సమస్య రాలేదు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సర్వే పూర్తయింది.      – దేశపాక కృష్ణస్వామి, గంగాపురం, వలిగొండ మండలం యాదాద్రి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement