’నషా ముక్త్ భారత్’ యాత్రలో సందేశాన్ని చదువుతూ ప్రతిజ్ఞ చేయిస్తున్న సినీ నటుడు చిరంజీవి. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, సీహెచ్.విద్యాసాగర్‌రావు, స్వామి బోధమయానంద, రాంచందర్‌రావు, ఈటల రాజేందర్
మీ జీవిత లక్ష్యమే వ్యసనం కావాలి
హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో చిరంజీవి
డ్రగ్స్ నిర్మూలనకు సమష్టి కృషి చేయాలని యువతకు పిలుపు.. సభికులతో కలిసి ప్రమాణం
నా ప్రయత్నానికి నేడు ప్రతి ఇంట్లో చర్చ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
3 రోజులు.. 40 కి.మీ. పాదయాత్ర.. పాల్గొన్న 43,000 మంది విద్యార్థులు
బంజారాహిల్స్, అమీర్‌పేట: యువత తమ జీవితంలో లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోవాలే తప్ప వ్యసనాన్నే జీవితంగా మార్చుకోవద్దని ప్రముఖ సినీనటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని.. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. యువత బంగారు భవిష్యత్తు, కుటుంబాల సంతోషం కోసం డ్రగ్స్‌రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ ఉద్యమంలో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ ప్రారంభించిన నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పేరిట చేపట్టిన మూడు రోజుల పాదయాత్ర శుక్రవారం సాయంత్రం ముగిసింది. నగరంలో సుమారు 40 కి.మీ. మేర సాగిన కిషన్‌రెడ్డి పాదయాత్రలో 220 స్కూళ్లు, 52 జూనియర్ కాలేజీలు, 30 ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన 43,000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో చిరంజీవి సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తమ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి సభికులందరితో డ్రగ్స్‌రహిత దేశం కోసం కృషి చేస్తామనే ప్రతిజ్ఞ చేయించారు.
కేబినెట్ భేటీ ఉన్నా ప్రధాని అనుమతితో చివరిరోజు యాత్ర చేపట్టా
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన రాజకీయాలకు అతీతమైన సామాజిక బాధ్యత అన్నారు. 2029 నాటికి దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, పోలీసులు, ప్రజలు సమష్టిగా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి అవగాహన కల్పించడంతోపాటు 2 వేల పునరావాస కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు. డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలనే సంకల్పంతో తాను చేసిన ఓ చిన్న ప్రయత్నానికి నేడు ప్రతి ఇంట్లో చర్చకు దారితీసిందని కిషన్‌రెడ్డి అన్నారు.
నేటి యువత భవిశత్తును, కుటుంబాల భద్రతను కాపాడేందుకు దీన్ని సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్పు తేవాలనే ఆలోచనతో ఈ ప్రచారంలో క్రీడాకారులు, సినీ ప్రముఖులు, విద్య, వైద్య రంగాల నిపుణులు సైతం పాలుపంచుకోవడం డ్రగ్స్‌రహిత సమాజానికి సంకేతమని తెలిపారు. డ్రగ్స్‌పై మరింత అవగాహన కల్పించడం కోసం స్కూల్ సిలబస్‌లో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలకు సంబంధించిన అంశాలను జోడించాల్సి విషయాలపై ప్రధాని మోదీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో పాల్గొనాలని పిలుపు వచి్చనప్పటికీ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి తన యాత్రకు వస్తున్న ప్రజాస్పందనను వివరించి వారి అంగీకారంతో యాత్ర కొనసాగించినట్లు చెప్పారు.
యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు బోధమయానంద, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి, సినీ దర్శకుడు సుకుమార్, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ఎం. రఘునందన్‌రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సహా ఆ పారీ్టకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ సంకల్పం విజయవంతం కావాలి: నాగార్జున
అంతకుముందు కిషన్‌రెడ్డి శుక్రవారం ఉదయం తన పాదయాత్రను అమీర్‌పేట నుంచి ప్రారంభించగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నటుడు సాయికుమార్, నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ఈ యాత్రలో పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. మైత్రివనమ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదికపై హీరో అక్కినేని నాగార్జున ప్రసంగించారు. పాదయాత్రలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం తనకెంతో సంతోషానిన్నచి్చందని తెలిపారు. డ్రగ్స్‌రహిత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువతతో ప్రమాణం చేయించారు.


